తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సినీ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. ఇక బాలీవుడ్ తారలు కూడా విందులు, వినోదాల్లో మునిగి తేలుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు.
ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్, నాగిన్ ఫేమ్ మౌనిరాయ్ కూడా ఒక న్యూఇయర్ పార్టీకి హాజరైంది. తన భర్తతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే మౌనిరాయ్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. కారణం ఆమె తప్పతాగి తూలుతూ ఆ వీడియోలో కనిపించడం. ఎస్ ! అసలు నడవలేని స్థితిలో ఉన్న మౌనిని.. ఆమె భర్త కారు దగ్గరకు తీసుకొచ్చి జాగ్రత్తగా ఎక్కించినట్టు ఆ వీడియో ఉంది. మధ్యలో తూగుతూ కింద పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. తమను ఎవరు ఫొటోలు తీయవద్దంటూ అందరికీ విజ్ఞప్తి చేశాడు మౌని రాయ్ భర్త. అలాగే కెమెరాలకు తన చేతిని కూడా అడ్డు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది. వీరి వెంట ప్రభాస్ కల్కి సినిమా హీరోయిన్ దిశా పటానీ కూడా ఈ వీడియోలో కనిపించింది. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్
ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??