నా చెల్లెళ్లను అమ్మేయాలని చూశారు.. అందుకే చంపేశా

నా చెల్లెళ్లను అమ్మేయాలని చూశారు.. అందుకే చంపేశా

Phani CH

|

Updated on: Jan 04, 2025 | 8:56 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో న్యూ ఇయర్ వేళ దారుణం జరిగింది. ఓ హోటల్‌ గదిలో ఓ వ్యక్తి తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను హత్య చేసాడు. వారి వయసు 9 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉంది. ఘటనా స్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హత్య చేసిన తర్వాత నిందితుడు అర్షద్‌ వీడియో తాజాగా బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు తన చెల్లెళ్లను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని, అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని తెలిపాడు.

తమ పొరుగున ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన వేధింపుల కారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాననీ తన తల్లి, తోబుట్టువులను తనే చంపేశాననీ వీడియో పోలీసులకు అందగానే బాధ్యులు ఎవరో తప్పక తెలిసిపోతుందనీ అన్నాడు. తమ ఇంటిని కబ్జా చేయాలని చూశారనీ వారి ఆక్రమణలను అడ్డుకునేందుకు యత్నించినా తమ మాట ఎవరూ వినలేదనీ తెలిపాడు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ, ఫుట్‌పాత్‌ మీదే నిద్రపోతున్నామనీ పిల్లలు అలా చలిలో తిరగడం తనకు నచ్చలేదనీ పత్రాలు తమ వద్దే ఉన్నా ఇప్పటికే సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయింది అని అర్షద్ ఆ వీడియోలో అన్నాడు. మణికట్టు నరాలు కోసి, ఊపిరాడకుండా చేసి వారిని చంపినట్లు చెప్పాడు. వారి మృతదేహాలను వీడియోలో చూపించాడు. తమ కుటుంబ పరిస్థితికి కారణమైన పలువురి పేర్లను వెల్లడించాడు. వారంతా లాండ్ మాఫియాలో భాగమనీ వారు ఆడపిల్లలను అమ్మేస్తుంటారనీ తన తండ్రిని, తనను తప్పుడు కేసులో ఇరికించి, తన చెల్లెళ్లను అమ్మేయాలనుకున్నారనీ చెప్పాడు. వాళ్లను హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతుంటే తాము చూడాలా..? అలాంటి పరిస్థితి తమకు రాకూడదు అనుకున్నామనీ అందుకే వారిని చంపేశామన్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!

ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!

సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??