కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
కొత్త సంవత్సరం ప్రారంభంలో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి చమురు సంస్థలు. జనవరి 1వ తేదీన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. గతేడాది జూలై తర్వాత తొలిసారిగా తగ్గించారు. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ మార్పు చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.14.50ల నుంచి రూ.16 వరకు తగ్గించాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
వివరాలు చూస్తే.. ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 14.50లు తగ్గింది. ధర తగ్గిన తరువాత దీని రేటు రూ.1,804లకు చేరింది. చెన్నైలో కూడా రూ.14.50లు తగ్గి రూ.1,966గా ఉంది. ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.15 తగ్గడంతో ఇప్పుడిది రూ.1,756కు చేరింది. కోల్‌కతాలో రూ.16 తగ్గి తర్వాత రూ.1,911లకు చేరింది. 6 నెలల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో కాస్త ఉపశమనం లభించింది. డిసెంబర్ 2024లో దీని ధర రూ.16 పెరిగింది. నవంబర్‌లో దీని ధరలను రూ.62 పెంచారు. గత కొన్ని నెలలుగా వాణిజ్య LPG సిలిండర్ల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.48.50 పెరిగి రూ.1,740కి చేరింది. అలాగే సెప్టెంబర్‌లో రూ.39 పెరిగింది. ఆగస్టులో కూడా రూ.8.50 పెరిగింది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర నేరుగా రెస్టారెంట్, హోటల్ వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. కొత్త సంవత్సరంలో కమర్షియల్ సిలిండర్ల ధర తగ్గడం వారికి ఉపశమనం కలిగించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్