ఇదే మంచి తరుణం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్
ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్‌లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా 3 లక్షల రూపాయల వరకు రేట్లను తగ్గించడం విశేషం. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కాలుష్యానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా ఈవీల అమ్మకాలు పెరిగాయి. తాజాగా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడంతో అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోవడంతో భారీ డిస్కౌంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ400, హీరో వీ1 ప్రో-వీ1 ప్లస్, ఏథర్ 450-రిజ్టా మోడళ్లు చౌకయ్యాయి. ఈ డిస్కౌంట్లలో ఎక్కువ భాగం వాహన తయారీ సంస్థలు భరిస్తుండగా, మిగతా వాటాను డీలర్లు మోస్తున్నారు. మొత్తానికి దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ జోష్‌ను అందిపుచ్చుకున్న వాహన రంగ కంపెనీలు.. పొంగల్, సంక్రాంతి ఉత్సాహాన్నీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.
వైరల్ వీడియోలు
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి

