చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ప్రపంచంలో మహాసముద్రాలు ఎన్ని అంటే ఐదు అని రెండో తరగతి పిలగాడు కూడా టక్కున సమాధానం చెబుతాడు. కానీ ఇక నుంచి సమాధానం మార్చుకోవాల్సిందేనట. మహా సముద్రాలు ఎన్ని అంటే ఆరు అని చెప్పాల్సి వస్తుందట. యస్.. ఇప్పుడున్న ఐదు మహాసముద్రాలకు తోడు మరో మహా సముద్రం ఆవిర్భవిస్తుందట. భూగోళ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భూమి లోపల టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతున్నదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. రానున్న కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు మూడొంతుల భాగం నీటితో కప్పిఉంది. ఇది అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రాలుగా డివైడ్ అయి ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు విస్తరించి ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో భూగోళ అంతర్గత శక్తుల ప్రభావం వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోతున్నదని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహా సముద్రం నీటితో కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటంతో ఆఫ్రికా ఖండం చీలిపోయే ప్రక్రియ కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోందని చెప్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక చాయ్, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్
తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్
ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??