ఒక్కడినే ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు.. చివరకు ??
ఆ అమ్మాయిలది స్కూల్ వయసు. స్కూల్‌కి వెళ్లి శ్రద్ధగా చదవాల్సిన వయసులో ప్రేమలో పడ్డారు. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఈ ఇద్దరమ్మాయిలూ ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఈ విషయం ఇద్దరికీ ఆలస్యంగా తెలిసింది. దీంతో వాడు నావాడు అంటే.. కాదు.. నాడు అంటూ ఇద్దరు బాలికలు రోడ్డెక్కారు. అంతేనా.. సిగపట్లు పట్టి స్కూల్ ఆవరణలోనే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు.
తోటి విద్యార్ధులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకోవడంతో వీరి సమస్యకు పరిష్కారం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో వెలుగులోకి వచ్చింది.
Published on: Jan 05, 2025 04:22 PM
వైరల్ వీడియోలు
Latest Videos