ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో 30 గ్రామాలను మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్ ను మహారాష్ట్ర అటవీశాఖ రెస్క్యూ టీం ఎట్టకేలకు పట్టుకుంది. కొమురంభీం జిల్లా సరిహద్దు సిర్పూర్ మండలం మకాడికి సమీపంలో దీనిని పట్టుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలుక అంతర్గాం - అత్మారాం గూడ అభయారణ్యం లో ఈ పులిని బంధించారు.
దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూ చేసి మత్తు మందు ఇచ్చి పులిని బోనులో పెట్టగలిగారు. అంతర్గాం సమీపంలో పశువు పై దాడి చేసి మాంసం తింటున్న పులిని గుర్తించిన షార్ప్ షూటర్ .. ట్రాంక్విలైజర్ల సాయంతో పులిని పట్టుకోగలిగారని మహారాష్ట్ర అటవీశాఖ పేర్కొంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పది మంది నిపుణుల బృందం పాల్గొనట్టు తెలుస్తోంది. గత నెల రోజుల క్రితం కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ లో వ్యవసాయ కూలీని హతమార్చిందీ పులి. తరువాత మహారాష్ట్ర వైపు వెళుతూ 24 గంటల వ్యవధిలోనే సిర్పూర్ మండలం దుబ్బగూడా లో సురేష్ అనే రైతు పై దాడి చేసింది. దీంతో పులికి సంబంధించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్టు మహారాష్ట్ర అటవీ శాఖ తెలిపింది. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత టైగర్ రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ బోనుకు చిక్కడంతో అటు రాజురా తాలూక.. ఇటు కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టేషన్‌లో వీల్‌చైర్ కు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు
Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..
నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..
14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..