Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..
ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే. మరీ ముఖ్యంగా US ప్రీమియర్స్‌లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా షురూ అయింది. మరిప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరగబోతుంది. మరి రామ్ చరణ్ ముందు.. ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..?
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. ముఖ్యంగా శంకర్ తన మార్క్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్‌ను USAలో చేసారు. ఫస్ట్ టైమ్ ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. డిసెంబర్ 21న జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసింది గేమ్ ఛేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాసాయి. దేవరకు ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే.. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడికి 5.56 మిలియన్ డాలర్స్ వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..
14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..