నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..

నేను బతకడం కష్టమే అన్నారు.. అయినా పోరాడి గెలిచా..

Phani CH

|

Updated on: Jan 05, 2025 | 4:17 PM

తన అందం, నటనతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది సోనాలి బింద్రే. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హిట్స్ కొట్టింది. ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఉన్నారు. సోనాలి బింద్రే.. ఇటీవలే తన 50వ పుట్టినరోజు జరుపుకుంది. క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచిన సోనాలి..ఈ మధ్యే తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి మాట్లాడింది. ఆ రోజులు ఆమెకు, ఆమె కుటుంబానికి చాలా కష్టంగా ఉండేవట.

అప్పటి సంగతులన్నీ ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది. “నాకు క్యాన్సర్ అని తెలినప్పుడు ఓ రియాలిటీ షో చేస్తున్నాను. ప్రతి వారం షూటింగ్‌ చేసేవాళ్లం. అయితే అనుమానం వచ్చి ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఈ వ్యాధి గురించి బయటపడింది” అని చెప్పింది సోనాలి. క్యాన్సర్‌లో అప్పటికి అది ఫస్ట్ ఫేజ్ అనుకున్నానని, కానీ..తరవాత శరీరమంతా ఈ క్యాన్సర్ కణాలు వ్యాపించాయని చెప్పింది. ఈ విషయం తెలిసి తన భర్త, డాక్టర్‌తో పాటు అందరూ షాకయ్యారని.. అప్పట్లో తాను బతికే అవకాశం కేవలం 30 శాతం మాత్రమే ఉందని డాక్టర్లు అనడంతో.. వారందరూ ఆందోళన చెందారని చెప్పింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..

పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??