పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని

పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని

Phani CH

|

Updated on: Jan 05, 2025 | 4:07 PM

కుక్కలంటే మనుషులకు అత్యంత ప్రేమ. పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్‌ వ్యాధులు వస్తాయి. తాజాగా క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న పెంపుడు కుక్క మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక రాజ‌శేఖ‌ర్ అనే యువ‌కుడు బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డాడు. వివ‌రాల్లోకి వెళితే.. బెంగ‌ళూరులోని హెగ్గడ‌దేవ‌న‌పుర‌లో నివాసం ఉండే రాజ‌శేఖ‌ర్ తొమ్మిదేళ్లుగా జ‌ర్మన్ షెప‌ర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు బౌన్సీ. అయితే, ఆ శున‌కం అనారోగ్యంతో మంగ‌ళ‌వారం నాడు చ‌నిపోయింది. దాంతో అదే రోజు త‌న వ్యవ‌సాయ క్షేత్రంలో దాని అంత్యక్రియ‌లు నిర్వహించాడు. ప్రాణంగా చూసుకున్న బౌన్సీని కోల్పోవ‌డం రాజ‌శేఖ‌ర్‌ను తీవ్రంగా క‌లిచివేసింది. దాని మృతిని త‌ట్టుకోలేక ఆత్మహ‌త్య చేసుకున్నాడు. అది కూడా బౌన్సీని క‌ట్టడానికి ఉప‌యోగించిన చైన్‌తోనే ఉరేసుకున్నాడు. బుధ‌వారం ఉద‌యం త‌న ఇంట్లో శ‌వ‌మై క‌నిపించాడు. ఈ ఘట‌న‌పై మ‌ద‌నాయ‌క‌న‌హ‌ళ్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??