సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??
లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నావ్..! IAS, IPS లాంటివి కాకుండా..! ఈ డైలాగ్ గుర్తుంది కదా.. మరిచిపోయేలా చెప్పాడా మన వెంకీ అనుకుంటున్నారు కదా..? ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అంటే..ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్‌క్లూజివ్ స్టోరీకి.. ఈ డైలాగ్‌కు ఓ కనెక్షన్ ఉంది. అదేంటో చూద్దామా..? సంక్రాంతికి ఇంకా వారం రోజుల టైమ్ కూడా లేదు.. అందుకే ఓవైపు రామ్ చరణ్.. మరోవైపు బాలయ్య.. ఇంకోవైపు వెంకటేష్.. ఎవరూ తగ్గట్లేదు.. ఎవరికి వాళ్లు ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
ఈ మూడు సినిమాల్లోని హీరో కారెక్టర్స్‌లో ఓ కామన్ పాయింట్ ఉంది. దాని గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు చేస్తున్నారు.. అందులో ఒకటి అప్పన్న అనే రాజకీయ నాయకుడు కాగా.. మరోటి రామ్ నందన్ ఐఏఎస్. ఈ రెండు కారెక్టర్స్‌పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. అలాగే ట్రైలర్‌లో పోలీస్ గెటప్ కూడా కనిపించింది. అది సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎక్స్ కాప్ అంటే..పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ IAS.. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ పోలీస్ కారెక్టర్స్‌పై క్లారిటీ ఉంది కానీ తాజాగా డాకూ మహరాజ్‌పై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఇందులో బాలయ్య IAS ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు బాలయ్య. అందులో IAS ఆఫీసర్ పాత్ర గోప్యంగా ఉంచారు దర్శకుడు బాబీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ఏడాదిలో గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!