14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..

14 రోజులు కోమాలో ఉన్న నాబిడ్డ.. కళ్లు తెరగానే ఆ హీరో పేరే తలిచాడు..

Phani CH

|

Updated on: Jan 05, 2025 | 4:09 PM

2014లో సీనియర్ నటుడు నాజర్ కుమారుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉన్నాడు. అయితే స్పృలోకి రాగానే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పేరు తలచాడట. ఈ విషయాన్ని నాజర్ ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దళపతి విజయ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

తమిళనాడులోనే కాకుండా కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నాజర్ కుమారుడు నూరుల్ హసన్ ఫైజల్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నాజర్ బయటపెట్టారు. సినిమాలతో బిజీగా ఉండే ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తన కొడుకు ఘోర ప్రమాదానికి గురయ్యాడని 14 రోజుల పాటు కోమాలో ఉన్నాడని చెప్పిన నాజర్.. లేచి చూసేసరికి నాన్న పేరుగానీ, అమ్మ పేరునుగానీ చెప్పలేదని.. హీరో విజయ్ పేరే తలచాడన్నారు. ఆ తర్వాత తన కొడుకు కోలుకునేంత వరకు విజయ్ సినిమాలు, పాటలను చూపించడం మొదలుపెట్టామన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే తన కొడుకు కోలుకోవడానికి దళపతి విజయ్ కూడా చాలా సహకరించాడని కాస్త ఎమోషనల్‌గా నవ్వుతూ చెప్పాడు నాజర్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న య‌జ‌మాని

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా ??