AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగ లెక్చరర్లు మాకొద్దు.. లేడీ లెక్చరర్లను నియమించండి.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!

కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో పనిచేసే లైబ్రేరియన్ కామపిశాచుగా మారాడు.  విద్యార్థులను పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లైబ్రేరియన్‌కు దేహశుద్ధి చేశారు. మగ లెక్చరర్ల స్థానంలో తమకు ఆడ లెక్చరర్లను నియమించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.

మగ లెక్చరర్లు మాకొద్దు.. లేడీ లెక్చరర్లను నియమించండి.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!
Kurnool News
J Y Nagi Reddy
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 04, 2025 | 5:41 PM

Share

కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో పనిచేసే లైబ్రేరియన్ కామపిశాచుగా మారాడు.  విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లైబ్రేరియన్‌కు దేహశుద్ధి చేశారు. సదరు లైబ్రేరియన్‌పై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ రహదారిపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఏపీఆర్జేసీలో చోటు చేసుకుంది.

బనవాసి దగ్గర ఉన్న ఏపీఆర్జేసీ గురుకుల కళాశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న మద్దిలేటి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీని పట్ల ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్, మహిళా అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి తెలిపింది. విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు చేరుకొని తమ బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రరీయన్‌కు దేహశుద్ధి చేశారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైబ్రేరియన్ పై ఫోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతంలో కూడా లైబ్రరీ మద్దిలేటి, మరికొందరు పురుష సిబ్బంది అక్కడ చదువుకున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ రక్షణ లేదంటూ కొందరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరో రెండు నెలల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా పురుష లెక్చలర్లు విద్యార్థులను పట్ల ఆసభ్యంగా ప్రవర్తించే వారని విద్యార్థినులు కంటతడి పెట్టారు. ఉన్నతాధికారుల స్పందించి మహిళల కళాశాలలో పురుష లెక్చరర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో మహిళా లెక్చరర్లు మాత్రమే క్లాసులు జరిపేలా చర్యలు చేపట్టాలని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.

కర్నూలు జిల్లా గురుకుల కాలేజీలో ముద్దు పెట్టాలని, హగ్ చేసుకోవాలని ఇంటర్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన సంఘటన పట్ల ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఫోక్స్ చట్టం కింద లైబ్రేరియన్ మద్దిలేటి అరెస్టు కాగా.. మొత్తం సంఘటనకు బాధ్యుడిగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గుప్తాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.