Health Tips: ధూమపానం చేసేవారి లైఫ్ ఎంత తగ్గుతుందో తెలుసా? షాకింగ్ నివేదిక!
Health Tips: జర్నల్ ఆఫ్ అడిక్షన్‌లో ప్రచురించబడిన విశ్లేషణ ప్రకారం.. ఒక సిగరెట్ పురుషుడి జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీ జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుందట. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే టీబీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. చాలా సార్లు సిగరెట్లు..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్లపై రాసి ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. లేదా ఏదైనా సినిమా ప్రారంభమయ్యే ముందు కూడా దీనికి సంబంధించి ప్రకటన కూడా వస్తుంటుంది. సిగరెట్లు మీ జీవితంలోని క్షణాలను ఎలా నాశనం చేస్తాయో ఒక కొత్త అధ్యయనం నివేదించింది. సిగరెట్ తాగితే వెంటనే ఆపేయాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో ధూమపానం మానేయాలని తీర్మానం చేయండి. ఎందుకంటే సిగరెట్లు నెమ్మదిగా జీవితాన్ని నాశనం చేస్తాయి. సగటున ఒక సిగరెట్ ఒక వ్యక్తి జీవితాన్ని 20 నిమిషాలు తగ్గిస్తుంది. ఒక వ్యక్తి రోజుకు 20 సిగరెట్లు తాగితే, మీ జీవితంలో 7 గంటలు తగ్గుతాయి. జర్నల్ ఆఫ్ అడిక్షన్‌లో ప్రచురించబడిన విశ్లేషణ ప్రకారం.. ఒక సిగరెట్ పురుషుడి జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీ జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుందట. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అలాగే టీబీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. చాలా సార్లు సిగరెట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి. పరిశోధన మద్యం, పొగాకుపై నిర్దిష్ట సమాచారాన్ని సేకరించింది.
నలభై ఏళ్లు దాటలేదా?
నివేదికల ప్రకారం, సిగరెట్ తాగడం వల్ల 40 ఏళ్లు దాటలేని సిగరెట్ తాగేవారు చాలా మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి ఏ వయసులోనైనా ధూమపానం మానేయవచ్చు. ఇది మరణానికి ఒక ఎస్కలేటర్. మీరు ఎంత త్వరగా మానేస్తే అంత ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
UKలో ప్రతి సంవత్సరం 80,000 మంది మరణిస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ రోగాల బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం 10 మందిలో 3 మంది సిగరెట్ కారణంగా మరణిస్తున్నారు. UK లోనే ధూమపానం వల్ల ప్రతి సంవత్సరం 80,000 మంది మరణిస్తున్నారు. ఇంగ్లండ్‌లో నాల్గవ వంతు క్యాన్సర్ మరణాలు సిగరెట్ కారణంగా సంభవిస్తున్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, సిగరెట్ తాగే వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే వేగంగా అనారోగ్యానికి గురవుతాడు. ఉదాహరణకు 60 ఏళ్ల వ్యక్తి సిగరెట్ తాగితే, అతని ఆరోగ్యం 70 ఏళ్ల వృద్ధుడితో సమానంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి