- Telugu News Photo Gallery How Adding Cloves To Your Diet Can Keep Hands And Feet Warm All Winter Long
Cloves in Winter: చలి చంపేస్తుందా? లవంగాలతో చలి.. గిలి.. జాన్తానయ్..! ఎలా వాడాలంటే
ఆయుర్వేదంలో లవంగాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే మన పూర్వికులు ఈ సుగంద ద్రవ్యాలను ఆహారంలో చేర్చారు. అయితే ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది. కొంత మందికి ఇతరుల కంటే కాస్త అధికంగా చలిగా ఉంటుంది. ఇలాంటి వారు చలి నుంచి ఉపశమనం పొందాలంటే లవంగా సాయం తీసుకోవచ్చు. ఎలాగంటే..
Updated on: Jan 05, 2025 | 12:26 PM

తెలుగోళ్ల వంటగదిలో లవంగాలు తప్పనిసరిగా ఉంటాయి. వంటకాలకు లవంగాలు ప్రత్యేక రుచిని అందిస్తాయి. అయితే ఇది చలికాలంలో వీటిని తింటే ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో చలి నుంచి రక్షణ పొందడానికి లవంగాలు బలేగా ఉపయోగపడతాయి. ఎలాగంటే

చలి నుంచి లవంగాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. చలికాలంలో మాటిమాటికి కాళ్లు, చేతులు చల్లగా మారుతుంటాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, మెదడు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు ఉష్ణోగ్రతను నిర్వహించడానికి వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.

శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి లవంగాలు ఉపయోగపడతాయి. అందుకే ఈ కాలంలో వాటిని భోజనంలో చేర్చాలి. ఎందుకంటే ఇవి చలికాలంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యూజీనాల్ అనే లవంగాలలోని బయోయాక్టివ్ సమ్మేళనం రక్త నాళాలను విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నోటి ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహిస్తాయి. మృదువైన చర్మం అందిస్తాయి.

ఆహారంలో లవంగాలను ఎలా చేర్చుకోవాలంటే.. ఉదయం టీలో 2-3 లవంగాలను జోడించి తాగవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో లవంగాలను వేసి రోజంతా త్రాగవచ్చు. వంగాల పొడిని సూప్‌లు, డెజర్ట్‌లపై చల్లి వినియోగించవచ్చు.




