ఈ సిరీస్‌లో, ఆసియా ఆటగాడిగా అత్యధికంగా 5 వికెట్లు తీసిన సెనా దేశాలలో మూడో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. సేనా దేశంలో అతను 9 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ జాబితాలో అతని కంటే ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్ మాత్రమే ముందున్నారు. సేనా దేశాల్లో ముత్తయ్య మురళీధరన్ 10 సార్లు, వసీం అక్రమ్ 11 సార్లు 5 వికెట్లు తీశారు. అంటే, గత టెస్టులో గాయం కారణంగా చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయినప్పటికీ, ఈ పర్యటన బుమ్రాకు అనేక విధాలుగా మేలు చేసింది.