Auto News: హ్యుందాయ్ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..!
Auto News: కారును కొనుగోలు చేసే ముందు, కారు కండిషన్, పార్ట్స్, పేపర్‌లను సరిగ్గా వెరిఫై చేయండి. ఈ విషయాలను తనిఖీ చేయకుండా చెల్లింపు చేయడం వలన మీరు చాలా నష్టపోతారు. ఈ వార్త మీ సమాచారం కోసం మాత్రమే. అన్ని తనిఖీ..
హ్యుందాయ్ ప్రసిద్ధ SUV క్రెటా అంటే చాలా మందికి ఇష్టమే. డిజైన్ నుండి ఈ వాహనంలో లభించే ఫీచర్ల వరకు ప్రతిదీ అద్భుతమైనది. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుతం కొత్త క్రెటాను కొనుగోలు చేయడానికి మీ వద్ద బడ్జెట్ ఉండని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రూ.13.42 లక్షలు ఉన్న ఈ కారును కేవలం రూ.5.72 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఎలాగో చూద్దాం.
స్పిన్నీ సమాచారం ప్రకారం.. సెకండ్ హ్యాండ్‌లో హ్యుందాయ్ క్రెటా S పెట్రోల్ వేరియంట్ రూ. 5 లక్షల 72 వేలకు అమ్ముడవుతోంది. కారు 2015 మోడల్ 83000 కిలోమీటర్లు నడిచింది. ఈ సెకండ్ హ్యాండ్ SUVని దాని రెండవ యజమాని విక్రయిస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు జనవరి 2026 వరకు ఇన్సూరెన్స్‌ను కూడా పొందవచ్చు. ఈ కారు ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో అందుబాటులో ఉంది.
Olx సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ క్రెటా 2015 మోడల్ S వేరియంట్‌లో రూ. 5.75 లక్షలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారును 80,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కారును ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో విక్రయిస్తున్నారు.
కార్24 సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ క్రెటా E ప్లస్ మోడల్ రూ. 7.42 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ కారు ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో అందుబాటులో ఉంది. ఈ కారు 59,085 కిలోమీటర్లు నడిచింది.
హ్యుందాయ్ క్రెటా ధర:
హ్యుందాయ్ అధికారిక సైట్ ప్రకారం, ఈ కారు ధర రూ.10,99,900 (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 20,29,800 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. స్పిన్నీలో విక్రయిస్తున్న ఈ వేరియంట్ ధర రూ. 13.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). క్రెటా మైలేజ్ ప్రకారం.. SUV లీటరుకు 17.4 కి.మీ నుండి 21.8 కి.మీ మైలేజీని ఇస్తుంది.
ఏదైనా పాత కారును కొనుగోలు చేసే ముందు, కారు కండిషన్, పార్ట్స్, పేపర్‌లను సరిగ్గా వెరిఫై చేయండి. ఈ విషయాలను తనిఖీ చేయకుండా చెల్లింపు చేయడం వలన మీరు చాలా నష్టపోతారు. ఈ వార్త మీ సమాచారం కోసం మాత్రమే. అన్ని తనిఖీ చేసిన తర్వాతే కొనుగోలు చేయడం ఉత్తమం. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: EPFO: పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇప్పుడు ఎక్కడి నుంచైనా పెన్షన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి