AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT5 pro smart watch: ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల

వాచ్ అంటే గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. దానితో పాటు చేతి మణికట్టుకు అందాన్ని ఇచ్చేది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత వాచ్ దాదాపు కనుమరుగైంది. అయితే ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ లోని టెక్నాలజీ పాటు ఆరోగ్యం, వ్యాయామానికి సంబంధించిన అనేక ఫీచర్లు వీటిలో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువానే నుంచి వాచ్ జీటీ ప్రో 5 పేరుతో కొత్త వాచ్ విడుదలైంది. దీని ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.

GT5 pro smart watch: ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్ విడుదల
Gt5 Pro Smart Watch
Nikhil
|

Updated on: Jan 04, 2025 | 3:45 PM

Share

హువానే జీటీ 5 ప్రో వాచ్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ, ఫిట్ నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. దీనిలో ఈసీజీ ఫీచర్ అదనపు ప్రత్యేకత. మెరుగైన డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ పరికరాలను అనుకూలంగా ఉంటుంది. ఈ వాచ్ రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. దీనిలోని బ్లాక్ వేరియంట్ ను రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. హునావే కంపెనికి చెందిన ట్రూ సెన్స్ అనే సాంకేతికతతో వాచ్ జీబీ 5ను రూపొందించారు. ఒత్తిడి, గుండె స్పందన, రక్త ఆక్సిజన్ , నిద్ర తదితర వాటిని పర్యవేక్షించుకోవచ్చు. దీనిలోని బీట్ బై బీట్ ఈసీజీ ద్వారా గుండె స్పందనను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

ఇటీవల కాలంలో ఫిట్ నె స్ పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. అలాంటి వారి కోసం ఈ స్మార్ట్ వాచ్ లో ఫీచర్లు ఉన్నాయి. ప్రో గోల్ప్, ట్రయల్ జాగింగ్, డ్రైవింగ్ వంటి వాటితో పాటు వందకు పైగా వ్యాయామ మోడ్ లకు మద్దతు లభిస్తుంది. జీపీఎస్ మ్యాప్ లు, నావిగేషన్ ఫంక్షన్లతో పాటు అనేక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. డిజైన్, మన్నిక పరంగా జీబీ5 ప్రో వాచ్ కు వందశాతం మార్కులు పడుతున్నాయి. ఏరో స్పేస్ – గ్రేడ్ టైటానియం అల్లాయ్ ఒంపు, నానోక్రిస్టల్ సిరామిక్ బాడీ, సప్పైర్ గ్లాస్ స్క్రీన్ ఆకట్టుకుంటున్నాయి. ఐపీ 69కే రేటింగ్ కారణంగా నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. ఏ సమయంలోనైనా చేతికి ధరించి ప్రయాణం చేయవచ్చు. స్మార్ట్ వాచ్ బ్యాటరీ సామర్థ్యం చాాలా మెరుగ్గా ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 14 రోజులు పనిచేస్తుంది. తరచూ చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అసలు ఉండదు. బ్లూటూత్ కాలింగ్ , టెక్ట్స్ రిప్లయి ఫీచర్లకు మద్దతు లభిస్తుంది.

హునావే అనేది సమాాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ. దీన్ని 1987లో రెన్ జెంగ్ ఫీ స్థాపించారు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ లో ఉన్న షెన్ జెన్ లో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. తొలుత టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్వీచ్ లను తయారు చేసేది. కాల క్రమీణా టెలి కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ లకు విస్తరించింది. ప్రపంచంలోని 170 దేశాలకు తన ఉత్పత్తులు, సేవలను అందజేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి