Gold Price Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price Today: బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఓరోజు తగ్గితే, మరోరోజు పెరుగుతుంటాయి. కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు భయపెడుతున్నాయి. తొలి రోజు మినహా గత మూడు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం (04-01-2024) నాడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
Gold Price Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొత్త ఏడాది తొలి రోజు మినహా.. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధలు షాక్‌లనూ షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 900లు పెరిగింది. అంటే నేడు రూ. 72610లుగా నమోదైంది. ఇక 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 870 పెరగి రూ. 79,210కి చేరింది. వెండి ధర రూ. 100లు పెరిగి రూ.92,600లుగా నమోదైంది. మరి దేశంలోని పలు నగరాల్లో నేడు అంటే శనివారం (04-01-2025) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,360
ముంబై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210
కోల్‌కతా:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210
చెన్నై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210
బెంగళూరు:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210
ఇక తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610లుకాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం బాటలో కాకుండా వెండి ధర మాత్రం తగ్గింది. తాజాగా వెండి ధర హైదరాబాద్, కేరళ, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 1,00,100లు కాగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,600లుగా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి