ఆధార్ కార్డు అప్డేట్ కొత్త రూల్స్..ఇవన్నీ ఉచితమే.. వాటికి మాత్రం ఫీజు..
Venkatrao Lella
Images: Pinterest
29 OCT 2026
ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే సరిచేసుకోవడం ముఖ్యం. దీంతో వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అప్డేట్ రూల్స్ తెలుసుకుందాం.
5 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు తొలిసారి బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం ఉచితం. దీంతో ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటోగ్రాప్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక 15 నుంచి 17 ఏళ్ల వయస్సు మధ్యలో తొలి, రెండో బయోమెట్రిక్ అప్డేట్ ఫ్రీగానే చేసుకోవచ్చు.
7 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు 2027 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా బయోమెట్రిక్స్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. ఇక మిగతా వయస్సువారు బయోమెట్రిక్స్ అప్డేట్ కోసం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది
పేరు, లింగం, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం రూ.75 ఫీజు చెల్లించాలి. ఇక ఈ-మెయిల్ ఐడీని ఆధార్ యాప్ ద్వారా 2026, డిసెంబర్ 31 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా చేసుకోవాలంటే ఫీజు చెల్లించాలి.
కొత్త ఆధార్ నమోదు అనేది పూర్తిగా ఉచితమని చెప్పవచ్చు. కొత్తగా తీసుకునే సమయంలో ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. ఆ తర్వాత వివరాలు అప్డే్ట్ చేసుకోవాలంటే సేవా రుసుంలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఆధార్ ప్రొఫైల్‌లో సమాచారాన్ని ధృవీకరించేందుకు అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు రుజువు సమర్పించడానికి మీరు ఉపయోగించే ఛానెల్‌ను బట్టి ఛార్జీలు ఉంటాయి. మై ఆధార్ పోర్టల్ ద్వారా జూన్ 14,2027 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ నమోదు లేదా అప్డేట్ కేంద్రంలో పత్రాలు సమర్పించాలంటే రూ.75 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆధార్ యాప్, యూఐడీఏఐ పోర్టల్‌లో ఉచితంగా సమర్పించడం మంచిది.
ఆధార్‌లో అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లు, రెంటర్ అగ్రిమెంట్ లాంటివి సమర్పించాలి. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు వంటివి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం యూఐడీఏఐ పోర్టల్, ఆధార్ యాప్ ద్వారా ఇంటి వద్దనే సులువుగా అప్డేట్ చేసుకోనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.