Hyundai Creta EV: క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా.. 473 కిలోమీటర్ల మైలేజ్‌తో నయా వెర్షన్
దేశంలోని రహదారులపై ఎలక్ట్రిక్ కార్లు జోరు విపరీతంగా పెరిగింది. ఎక్కడా చూసినా ఇవి పరుగులు పెడుతూ కనిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత, మెరుగైన ఫీచర్లతో రూపొందించిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ఉపశమనంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ కార్లు దోహదపడతాయి. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలకు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. మెరుగైన ఫీచర్లు, బెస్ట్ రేంజ్ తో ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ నుంచి క్రెటా ఈవీ జనవరిలో విడుదల కానుంది. సింగిల్ చార్జింగ్ పై 473 కిలోమీటర్లు పరుగులు తీయడం ఈ కారు ప్రత్యేకత. ఈ ఏడాది జనవరిలో భారత్ మెబిలిటీ ఎక్స్ పో జరగనుంది. దీనిలో హ్యుందాయ్ క్రెటా ఈవీని ప్రదర్శించనున్నారు. దీని ధర, ఇతర ప్రత్యేకతలు అప్పుడే పూర్తిస్థాయిలో వెల్లడిస్తారు. ఈ కారుతో మాస్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ మార్కెట్ లోకి హ్యుందాయ్ ప్రవేశించనుంది. ఈ కారు ఫీచర్లు, ఇతర ప్రత్యేకతల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. వాటితో పాటు విశ్వసనీయ సమాచారం ప్రకారం క్రెటా కారు ప్రత్యేకతలు తెలుసుకుందాం.
క్రెటా ఈవీ 42, 51.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో అందుబాటులోకి రానుంది. మొదటి బ్యాటరీపై 390, రెండో బ్యాటరీ 473 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని పవర్, టార్క్ అవుట్ పుట్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ కారు కేవలం ఏడు నుంచి ఎనిమిది సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఎఫ్ డబ్ల్యూడీ సెటప్, సింగిల్ మోటార్ కాన్పిగరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. కారును డీసీ ఫాస్ట్ చార్జర్ తో 58 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 11 కేడబ్ల్యూ స్మార్ట్ కనెక్టెడ్ వాల్ బాక్స్ చార్జర్ తో నాలుగు గంటల్లో సున్నా నుంచి వంద శాతం చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ కంపెనీ షేర్ చేసిన వీడియోలో కొత్త ఈవీ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఐసీఈ వెర్షన్ కారు మాదిరిగా కనిపించినా, ప్రత్యేక మైన లుక్ తో కనిపిస్తోంది. సంప్రదాయం గ్రిల్ స్థానంలో పియానో బ్లాక్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. బంపర్లను వెండి ట్రిమ్ ముక్కలతో తీర్చిదిద్దారు.
కారు ఇంటీరియర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. దీనిలో అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్ హెచ్ డీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ పరికరాలను చార్జింగ్ చేసుకునేందుకు వెనుక సీట్ల మధ్య ప్రత్యేక పోర్ట్ , ఇక హైటెక్ ఫీచర్లపై ఫిప్ట్ బై వైర్ టెక్నాలజీ, వన్ పెడల్ డ్రైవింగ్ ఫీచర్ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి