AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renault offer: రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!

మన దేశంలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. సంపన్నులతో పాటు మధ్య తరగతి కుటుంబాలు కూడా వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు కార్ల ధరలు కూడా అందుబాటులోకి రావడం దీనికి ప్రధానం కారణం. వివిధ కంపెనీలు ఆధునిక ఫీచర్లతో కార్లను తయారుచేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Renault offer: రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
Renault Offers
Nikhil
|

Updated on: Jan 04, 2025 | 4:15 PM

Share

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ కూడా కొత్త ఆఫర్ తీసుకువచ్చింది. 2025 జనవరి ఒకటి తర్వాత తన వాహనాలను కొనుగోలు చేసిన వారికి మూడేళ్లు, లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. రెనాల్ట్ కంపెనీకి మన దేశంలో మంచి మార్కెట్ ఉంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ప్రస్తుతం దేశంలో ఈ కంపెనీకి చెందిన కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ మోడల్ త్వరలో విడుదల కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లపై రెనాల్ట్ ఆఫర్లు అమలు చేస్తుంది. వీటికి మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందజేస్తుంది. దీనికి అదనంగా కొత్త వారంటీ ప్యాకేజీలను తీసుకువచ్చింది. నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్లు, ఐదేళ్లు లేదా 1,20,000 కిలోమీటర్లు, ఆరేళ్లు లేదా 1,40,000 కిలోమీటర్లు, ఏడేళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వరకూ ఇవి వర్తిస్తాయి.

రెనాల్ట్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ కస్టమర్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో వాహనంలోని మెకానికల్, మెటీరియల్, తయారీ లోపాలు, ఎలక్ట్రికల్ వైఫల్యాలకు సంబంధించి అన్ని సమస్యలను అదనపు ఖర్చులు లేకుండా పరిష్కరిస్తారు. అలాగే రోడ్డుసైడ్ అసిస్టెన్స్, యాక్సిడెంటల్ టోయింగ్ కవరేజీ తదితర సౌకర్యాలు కల్పిస్తుంది. తర్వాత కస్టమర్లు తమ వారంటీని పైన చెప్పిన విధంగా 4, 5, 6, 7 ఏళ్ల వరకూ పొడిగించుకోవచ్చు. రెనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ సీఈవో ఎం.వెంకటరామ్ మాట్లాడుతూ తమ కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా మూడేళ్లు, లక్ష కిలోమీటర్ల వారంటీ తీసుకువచ్చినట్టు తెలిపారు. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కార్లపై విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

ప్రస్తుతం నగరాల్లో స్థిరపడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాటి శివారు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు వెలిశాయి. ఈ నేపథ్యంలో రాకపోకలకు కారు తప్పనిసరి అవసరంగా మారుతోంది. కుటుంబంలో సుమారు నలుగురు సభ్యులంటే కారు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే సురక్షితంగా, వేగంగా, సౌకర్యంగా ప్రయాణం చేయడానికి కార్లు చాలా ఉపయోగపడతాయి. నేటి బీజీ జీవితంలో కార్ లేకపోతే వేగంగా పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు