రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. వేగంగా, సురక్షితంగా పరుగులు పెడుతున్న భారత రైళ్లు.. ఎంత స్పీడుతో తెలుసా?

భారతీయ రైళ్లు తక్కువ దూరం ప్రయాణించే ఇంటర్‌-సిటీ ప్రయాణం కోసం వేగంగా పరుగులు పెడుతున్నాయి. గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్లు వేగంతో నడుస్తున్నాయి. ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్‌లతో సహా మెరుగైన భద్రతా చర్యల ద్వారా భారత రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాయి. భారత్‌లోని ఐదవ వంతు రైల్వే ట్రాక్‌లు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి.

రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. వేగంగా, సురక్షితంగా పరుగులు పెడుతున్న భారత రైళ్లు.. ఎంత స్పీడుతో తెలుసా?
Indian Trains
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 04, 2025 | 12:53 PM

ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు భారత రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. చిన్న, మధ్యస్థ దూరాల చైర్ కార్ రైళ్లలో ప్రయాణించే వ్యక్తులు త్వరలో సుదూర ప్రాంతాలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ప్రతి భారతీయుడు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని పొందుతున్నారు. తర్వలోనే అత్యంత వేగంగా పయనించే వందేభారత్ స్లీపర్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రయాణం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు సుదూర ప్రయాణానికి అందుబాటులో ఉంటుంది.

వేగవంతమైన రైలు ప్రయాణం! ఫెన్సింగ్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్‌లతో సహా మెరుగైన భద్రతా చర్యల ద్వారా భారత రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నాయి. భారత్‌లోని ఐదవ వంతు రైల్వే ట్రాక్‌లు అధునీకరించినట్లు భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం 130 కి.మీ.ల వేగంతో భారత రైలు పరుగులు పెడుతున్నాయన్నారు. మొత్తం 1.03 లక్షల కిలో మీటర్ల నెట్‌వర్క్‌ కలిగిన భారత రైల్వేలో దాదాపు 23,000 ట్రాక్ కిలోమీటర్లు ఇప్పుడు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి సరిపోతాయని ఒక సీనియర్ అధికారి చెప్పారు. తగ్గిన ప్రయాణ సమయాల ద్వారా మెరుగైన కనెక్టివిటీ పెరిగినట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 54,337 ట్రాక్‌ కిలో మీటర్ల దూరం ప్రస్తుతం గంటకు 110 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు భారతీయ రైల్వే అధికారులు ధృవీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 ట్రాక్ కిలో మీటర్ల లక్ష్యానికి 2,741 TKM నెట్‌వర్క్ వేగం ఇప్పటికే 110 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి. భారతీయ రైల్వేలు నెట్‌వర్క్‌లో అధిక రైలు వేగాన్ని అందించడానికి ట్రాక్, సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని చూస్తోంది. 160 కిలో మీటర్ల గరిష్ట వేగంతో సెమీ-హై స్పీడ్ రైళ్లను అనుమతించడానికి గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లోని కొన్ని ప్రధాన విస్తరణలు కూడా అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని భారత రైల్వే శాఖ పేర్కొంది.

మరో ముందడుగు వేసిన భారత రైల్వే శాఖ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వందేభారత్‌ను ఆధునీకరిస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు పెడుతోంది. ఆ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. ట్రైన్ బెర్త్‌ దగ్గర ఉన్న ట్రేపై‌ ఓ గ్లాస్‌ పెట్టి.. ఆ పక్కనే స్పీడ్‌ మెజర్‌మెంట్‌ని చూపిస్తూ.. వీడియోను ఆయన షేర్ చేశారు. అంత స్పీడ్‌లో వెళ్తున్న గ్లాస్‌లో నీళ్లు తొణక్కుండా కనిపిస్తోంది. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌ డివిజన్‌లో ఈ వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌కి సంబంధించిన స్పీడ్‌టెస్ట్ చేశారు.మలుపులు ఉన్న చోట్ల కూడా రైలును ఇదే స్పీడ్‌లో నడిపి పరీక్షించారు.

అలాగే పలుమార్లు బ్రేక్ టెస్టింగ్‌ కూడా చేశారు. జనవరి 1వ తేదీన 130 కిలోమీటర్ల వేగంతో ఈ వందేభారత్‌ పరుగులు పెడితే.. తర్వాత క్రమంగా 140కి, 150కి.. ఇలా 160 వరకూ స్పీడ్‌ పెంచుకుంటూ వెళ్లారు. కోటా నుంచి పలు రూట్లలో ఈ స్పీడ్‌ టెస్ట్ చేశారు. రోహల్‌ కుర్ద్‌ – కోటా మధ్యలో ఉన్న 40 కిలోమీటర్ల ట్రాక్‌లో స్పీడ్‌ టెస్ట్‌ చేసినప్పుడు గరిష్ట వేగాన్ని, అంటే 180 KMPHని చేరుకుంది. ఈ టెస్ట్‌ సమయంలో రైల్లో ప్రయాణికులు లేరు. అన్ని బెర్త్‌లు నిండితే ఉండేంత స్థాయిలో బరువును ట్రైన్‌లో యాడ్ చేసి ఈ స్పీడ్ టెస్ట్ చేశారు. పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలో లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ -RDSO ఈ పరీక్షలు చేస్తోంది.

ఇక భారతీయ రైల్వేలు గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఆదాయాలలో 4% పెరుగుదల నమోదు చేసుకుంది. 2% అధిక మూలధన వ్యయంతో మెరుగైన పనితీరును కనబరిచాయి. అదే విధంగా సరకు రవాణా కార్యకలాపాలు రూ. 1.26 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, మూలధన వ్యయం రూ. 1.92 లక్షల కోట్లకు చేరుకుందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ప్యాసింజర్ సెగ్మెంట్ ఆదాయం 6% పెరిగి రూ.55,988 కోట్లకు చేరుకుంది. పెరిగిన ఆదాయం ప్రధానంగా మెరుగైన సరుకు రవాణా ద్వారా వచ్చింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ ఇతరాలతో సహా రైలు సేవలు 3% పెరిగాయి. 2.07 మిలియన్లకు పైగా పరుగులు సాధించాయి. ఇది ఆల్ టైమ్ హై రికార్డు. గతేడాది ఇదే కాలంలో 2.02 మిలియన్ల రైలు సర్వీసులను నడిపామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరంతో పోల్చితే పీక్ డిమాండ్ వ్యవధిలో ప్రత్యేక రైలు సేవలు 54% పెరిగి 57,169కి చేరాయి. ప్రముఖ మార్గాల్లో 62 ప్రత్యేక రైళ్లను కలుపుతూ రైల్వే అథారిటీ కొత్త టైమ్‌ టేబుల్‌ను ప్రవేశపెట్టింది. కొత్త షెడ్యూల్‌లో 34 జతల వందే భారత్ రైళ్లతో పాటు 74 అదనపు సర్వీసులు కూడా ఉన్నాయి.

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు