AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి

రోడ్డుపై పది రూపాయలు కనిపిస్తేనే టక్కున తీసి జేబులో పెట్టుకునే వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో, ఇక్కడో విద్యార్థి మాత్రం రోడ్డుపై దొరికిన నగలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. విద్యార్థి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు అతనికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లాలో జరిగింది.

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
Class 7 Student Hands Over Found Gold Jewellery To Police
Anand T
|

Updated on: Oct 30, 2026 | 7:56 PM

Share

ఎవరికైనా రోడ్డుపై బంగారం దొరికితే ఏం చేస్తారు.. అటూ ఇటూ చూసి గప్‌చుప్‌గా దాన్ని జేబులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఇక్కడో విద్యార్థి మాత్రం అస్సలు అలా ఆలోచించలేదు.. మనది కాని సొత్తు మనకెందుకు అనుకొని రోడ్డుపై దొరికిన రెండు సవర్ల బంగారాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ఆ విద్యార్థి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు అతనికి శాలువా కప్పి సన్మానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పుదుక్కోట్టై జిల్లాలోని పొన్నమరవతి సమీపంలో ఉన్న వలియపట్టి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తమిళరసన్, పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, రోడ్డుపై పడి ఉన్న రెండు సవర్ల విలువైన బంగారు ఆభరణాన్ని చూశాడు.

వెంటనే వాటిని తీసుకొని తిరిగి మళ్లీ స్కూల్‌కు వెళ్లాడు. బంగారం దొరికిన విషయాన్ని వాళ్ల స్కూల్ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దీంతో విద్యార్థి నిజాయితీని మెచ్చుకున్న ఉపాధ్యాయులు, ఆ నగలను అసలు యజమానులకు అప్పగించడానికి అతడిని పొన్నమరవతి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తమిళరసన్, తనకు దొరికిన రెండు సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులకు భద్రంగా అప్పగించాడు. దీంతో దురాశకు పోకుండా విద్యార్థి చూపిన నిజాయితీకి మెచ్చుకున్న పోలీసులు అతన్ని ప్రశంసించి, శాలువా కప్పి సన్మానించారు.

ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినా ఆ విద్యార్థి దురాశకు పోకుండా నిజాయితీగా వాటిని తిరిగి ఇవ్వడం చాలా గ్రేట్ అంటూ అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us