చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయకూడదా?

samatha

30 october 2026

Pic credit - Pinterest

చాలా మంది ఉదయం లేచిందంటనే వాకింగ్ చేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కనీసం 10 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉదయం వాకింగ్

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వలన గుండె సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ఇది శరీరానికి  అనేక విధాలుగా మేలు చేస్తుంది.

గుండె సమస్యలు

అందుకే ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 5 గంటల నుంచి వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే చలికాలంలో కూడా ఇదే సమయంలో నడుస్తుంటారు.

తెల్లవారు జామున వాకింగ్ చేయడం

కానీ కొంత మంది వైద్య నిపుణులు మాత్రం చలికాలంలో ఉదయం, ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో వాకింగ్ చేయడం మంచిది కాదు అంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

వాకింగ్ చేయడం మంచిది కాదు

చలికాలంలో ఉదయం ఎక్కువ చలికాలం సమయంలో వాకింగ్ చేయడం వలన శరీరంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి.

రక్తనాళాలు కుచించుకపోవడం

అందువలన ఇలా చేయడం వలన రక్త ప్రసరణ తగ్గిపోయి, ఇది గుండెపై చాలా ప్రభావం చూపుతుంది కొన్ని సార్లు గుండె పోటు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నదంట.

గుండె పోటు ప్రమాదం

అందువలన గుండె జబ్బులు,  మధు మేహం సమస్యలతో బాధపడే వారు అస్సలే ఉదయం చలి ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ చేయకూడదంట.

గుండె, మధు మేహం సమస్యలు

అంతే కాకుండా తెల్లవారుజామున ఎక్కువ చలి, పొగమంచు ఉంటుంది, అది ఊపిరితిత్తులకు మంచిది కాదు. అందువలన చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయకూడదంట.

ఎక్కువ చలి, పొగమంచు

మరీ ముఖ్యంగా ఆస్తమా, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు ఉదయం 7.30 నిమిషాల తర్వాతే వాకింగ్ చేయడం మంచిదంట.

ఆస్తమా, బీపీ