AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఆ వీడియోలు నావి కావు.. రూ.400 చెల్లించొద్దు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం

ఈ మధ్యన చాలా మంది సెలబ్రిటీలు ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ ను మొదలు పెట్టారు. డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే తమ ఎక్స్ క్లూజివ్ ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. అయితే ఇప్పుడీ ఇన్ స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ ఆకతాయిలకు కూడా వరంగా మారిపోయింది.

Actress: ఆ వీడియోలు నావి కావు.. రూ.400 చెల్లించొద్దు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం
Actress Ritika Singh
Basha Shek
|

Updated on: Oct 30, 2026 | 7:30 PM

Share

ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌ హాట్ టాపిక్ గా మారింది. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తాం అంటూ కొంతమంది సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. తెలుగు బుల్లితెర సెలబ్రిటీలైన విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి.. ఇలా చాలా మంది ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారు. వీటి వల్ల వారికి ఎంత ఆదాయం వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ విధానం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ ఇన్ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌ ఆకతాయిలకు కూడా వరంగా మారింది. ఈ మేరకు ప్రముఖ హీరోయిన్ రితికా సింగ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా వాపోయింది రితికా. కొందరు ఆకతాయిలు తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్ చేసి నెలకు రూ.400 చొప్పున పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ వసూలు చేస్తున్నారని ఈ నటి సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఇలాంటి నకిలీ ఖాతాలను ఎవరూ నమ్మవద్దని, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని రితికా హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ ఉన్న ఖాతా మాత్రమే తన అధికారిక అకౌంట్‌ అని స్పష్టం చేసిందీ అందాల తార.

తన పేరుతో ఉన్న ఇతర నకిలీ ఖాతాలను గుర్తించి వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించింది రితికా సింగ్. అనధికారిక ప్రొఫైల్స్‌లో కనిపించే వీడియోలు, సబ్‌స్క్రిప్షన్ లింకులను నమ్మవద్దని ఆమె తన ఫాలో వర్స్ కు సూచించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఏఐ వీడియోలు, డీప్‌ఫేక్‌ వీడియోలతో సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అంటూ నకిలీ ప్రొఫైల్స్‌ రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఫ్యాన్స్ కు రితికా సింగ్ సూచన..

ఇక రితికా సింగ్ విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. ఈ బ్యూటీ ప్రొఫెషనల్ బాక్సర్ కూడా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us