AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC నర్సింగ్ కళాశాలలో BSc నర్సింగ్ ప్రవేశాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ తార్నాకలోని టీజీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 100 సీట్లలో 40 మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అర్హతలు, ప్రవేశాల పూర్తి వివరాలు ఈ కింద వివరంగా తెలుసుకోండి..

TGSRTC నర్సింగ్ కళాశాలలో BSc నర్సింగ్ ప్రవేశాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం
TGSRTC BSc Nursing Admissions
Srilakshmi C
|

Updated on: Oct 30, 2026 | 7:27 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఆధ్వర్యంలోని నర్సింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (నర్సింగ్) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఈ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద 40 సీట్లకు అడ్మిషన్లు కల్పించనున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఈ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల టీజీఎస్‌ఆర్టీసీకి చెందిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రత్యక్షంగా క్లినికల్ శిక్షణ పొందేందుకు అవసరమైన సదుపాయాలను కళాశాలలో అందుబాటులో ఉంచారు.

కళాశాలలో మొత్తం 100 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉండగా, వీటిలో 60 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరో 40 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు. మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

అర్హతలు ఇవే..

ఇంటర్మీడియట్ (10+2)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ వృత్తి విద్య (వొకేషనల్) అభ్యర్థులు బయోలాజికల్, ఫిజికల్ సైన్సెస్‌లో నిర్దేశించిన బ్రిడ్జి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ప్రవేశ నిబంధనల ప్రకారం నీట్ లేదా టీజీ ఈసెట్ పరీక్షకు హాజరై ఉండాలి. కళాశాలలో అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన అధ్యాపకులతో బోధన అందించనున్నారు. ఆధునిక పరికరాలతో కూడిన ప్రయోగశాలలు, క్లినికల్ శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రాంగణంలోని 200 పడకల టీజీఎస్‌ఆర్టీసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ కల్పిస్తారు. నర్సింగ్ వృత్తిలో రాణించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం కూడా అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు, దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను 7075009463 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఈమెయిల్: tsrtc.con@gmail.com

చిరునామా: టీజీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాల, టీజీఎస్‌ఆర్టీసీ హాస్పిటల్ క్యాంపస్, తార్నాక, హైదరాబాద్ – 500007.

Follow Us