AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ఇదేం సినిమా రా బాబోయ్.. ఓటీటీలో గత్తరలేపుతున్న క్రేజీ కామెడీ డ్రామా.. అస్సలు మిస్ అవ్వద్దు..

ఓటీటీ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు నచ్చుతున్నాయి. అంతేకాదు సినిమాల ఎంపికలో ఎప్పుడూ ఒక కొత్త జోనర్ లేదా విభిన్నమైన కంటెంట్ చూడాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా థియేటర్లలో మిస్ అయిన లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టిస్తోన్న సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఒక క్రేజీ తమిళ కామెడీ డ్రామా సినిమా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Rajitha Chanti
|

Updated on: Oct 30, 2026 | 5:52 PM

Share
ఓటీటీ ప్రియులకు సినిమాల ఎంపికలో ఎప్పుడూ ఒక కొత్త జోనర్ లేదా విభిన్నమైన కంటెంట్ చూడాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టిస్తోన్న సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన తాజా క్రేజీ తమిళ యాక్షన్-కామెడీ డ్రామా చిత్రం ‘బత్తా’ (Baththa) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

1 / 5
 కంటెంట్ పరంగా ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బాలాజీ తరణీతరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన లిజోమోల్ జోస్ నటించగా, మాస్టర్ సాయి పృథ్వీరాజ్ కీలక పాత్రలో అదరగొట్టారు. 1986 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఒక రౌడీగా పేరుగాంచిన బత్తా (విజయ్ సేతుపతి), అనుకోకుండా ఒక చిన్న పిల్లాడి వల్ల స్కూలు బాత్రూమ్‌లో బందీ కావడంతో అసలు కథ మొదలవుతుంది.

2 / 5
ఆ ఇద్దరి మధ్య నడిచే సరదా సన్నివేశాలు, ఎమోషనల్ ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వీక్షించడానికి కూర్చునే ప్రేక్షకులకు ఈ మూవీ సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ సినిమాకు చక్కటి ఆదరణ దక్కుతుండటంతో వీకెండ్‌లో కుటుంబసమేతంగా చూడదగ్గ చక్కటి చిత్రంగా నిలిచింది. బయటకు రాలేక, ఎవరికీ తన పరిస్థితి చెప్పుకోలేక బత్తా పడే ఇబ్బందులు.. ఆ చిన్న పిల్లాడి అమాయకత్వం వల్ల వారిద్దరి మధ్య ఏర్పడే విచిత్రమైన అనుబంధం సినిమాకు ప్రధాన హైలైట్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, చక్కటి భావోద్వేగాలు , కడుపుబ్బా నవించే కామెడీతో ఈ సినిమా తెరకెక్కింది.

3 / 5
ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ అదిరిపోయే మ్యూజిక్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రముఖ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని సమర్పించడం విశేషం. అక్టోబర్ 1న థియేర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్నాళ్లు, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ చూసిన అడియన్స్.. మంచి కామెడీ మూవీ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

4 / 5
ఈ చిత్రంలో నటించిన నటీనటుల సహజమైన నటన, దర్శకుడు ఎంచుకున్న పల్లెటూరి వాతావరణం, విలక్షణమైన కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వీక్షించడానికి కూర్చున్న ప్రేక్షకులకు ఈ మూవీ సరికొత్త అనుభూతిని పంచుతుంది. వీకెండ్‌లో కుటుంబసమేతంగా లేదా స్నేహితులతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక చక్కటి ఎంపిక అని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ క్రేజీ తమిళ కామెడీ డ్రామాను చూడనట్లయితే, వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. అస్సలు మిస్ కావొద్దు!

5 / 5
Follow Us