AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudravanam PS Review : రుద్రవనం PS వెబ్ సిరీస్ రివ్యూ.. నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా..?

తెలుగులో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ల జోరు ఇప్పుడు బాగా పెరిగింది. అదే కోవలో వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ రుద్రవనం PS. నరేష్ అగస్త్య నటించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. రుద్రవనం అనే ఒక మారుమూల ఊరిలో ఉన్న పోలీసుల కేంద్రం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే పోలీస్ అధికారి (నరేష్ అగస్త్య), తన పై అధికారితో (బెనర్జీ) కలిసి విధుల్లో ఉంటాడు.

Rudravanam PS Review : రుద్రవనం PS వెబ్ సిరీస్ రివ్యూ.. నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా..?
Rudravanam Ps Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 7:35 PM

Share

సిరీస్ రివ్యూ: రుద్రవనం PS

నటీనటులు: నరేష్ అగస్త్య, రాజా రవీంద్ర, చారు వాకన్, బెనర్జీ, ప్రీతి సుందర్ తదితరులు

సంగీతం: పవన్

ఎడిటర్: మాధవ్

సినిమాటోగ్రఫర్: అక్షర్ అలీ

దర్శకుడు: శశిధర్ మున్నంగి

నిర్మాణ సంస్థ: శ్రీచక్ర మూవీస్

తెలుగులో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ల జోరు ఇప్పుడు బాగా పెరిగింది. అదే కోవలో వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ రుద్రవనం PS. నరేష్ అగస్త్య నటించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రుద్రవనం అనే ఒక మారుమూల ఊరిలో ఉన్న పోలీసుల కేంద్రం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే పోలీస్ అధికారి (నరేష్ అగస్త్య), తన పై అధికారితో (బెనర్జీ) కలిసి విధుల్లో ఉంటాడు. తను సెలవు మీద వెళ్లాలి అనుకునే ముందు రోజు ఊహించని విధంగా ఒక గుర్తుతెలియని శవం దొరుకుతుంది. దానికి తోడు స్థానిక రాజకీయ నాయకుడి (రాజా రవీంద్ర) సోదరుడు కనిపించకుండా పోతాడు. ఈ రెండు వ్యవహారాలు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతాయి. ఇంతలో దొరికిన ఆ శవం మొండెం నుంచి తలకాయ అదృశ్యం అవుతుంది. అసలు ఆ శవం ఎవరిది? నాయకుడి తమ్ముడు ఏమయ్యాడు? ఈ చిక్కుముడులను ఆ అధికారి ఎలా విప్పాడు? అన్నదే ఈ సిరీస్ సారాంశం.

కథనం:

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సాగే వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేటప్పుడు ప్రేక్షకుడికి ఎక్కడా విసుగు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. సుదీర్ఘమైన ఎపిసోడ్స్ పెట్టి సాగదీయకుండా, చాలా తక్కువ నిడివితో విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేయడం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద బలం. మొత్తం 7 భాగాలుగా రూపొందిన ఈ సిరీస్‌లో, ప్రారంభం నుంచి 5వ భాగం వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నేర విచారణ తీరు, మధ్యలో వచ్చే ఊహించని మలుపులు చూసేవారిని కట్టిపడేస్తాయి. ప్రారంభంలో వచ్చే కుటుంబ అనుబంధాల సన్నివేశాలు కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. కానీ విచారణ ఎంత ఆసక్తికరంగా సాగిందో, ముగింపు కూడా అంతే బలంగా ఉండాలి. అక్కడే ఈ సిరీస్ కాస్త తడబడింది. 6వ ఎపిసోడ్ నుంచి కాస్త నెమ్మదిస్తుంది అలాగని పూర్తిగా ట్రాక్ తప్పదు. అప్పటివరకు ఒక అద్భుతమైన సస్పెన్స్ డ్రామా చూస్తున్నామన్న భావన కాస్తా, వీక్ రైటింగ్ వల్ల కాస్త తగ్గుతుంది. ఒక ముఖ్యమైన పాత్రను మరీ అతిగా, వినయంతో చూపించడంతో జరగబోయేది ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది. దాని వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ కూడా అంతగా రుచించదు. అలాగే భార్యకు సంబంధించిన ట్రాక్ కూడా కథకు అనవసరంగా అతికించినట్లు అనిపిస్తుంది. ముగింపులో బలమైన ఎమోషన్స్ ఉండి ఉంటే ఈ సిరీస్ స్థాయి మరోలా ఉండేది. ఊహకు అందే ముగింపు కూడా ఉంటుంది.. అయినా కూడా వీకెండ్‌కు డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవాళ్లకు రుద్రవనం పిఎస్ మంచి ఛాయిసే.

నటీనటులు:

పోలీస్ అధికారి పాత్రలో నరేష్ అగస్త్య చాలా సహజమైన నటన కనబరిచాడు. బాధ్యత గల అధికారిగా అతని హావభావాలు అందరినీ మెప్పిస్తాయి. పై అధికారిగా సీనియర్ నటుడు బెనర్జీ, పొలిటికల్ లీడర్‌గా రాజా రవీంద్ర తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. చారు వాకన్‌తో పాటు మిగిలిన నటీనటులు అంతా తమకు ఇచ్చిన క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

నిర్మాణ విలువలు ఈ తరహా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు సరిపోయేలా ఉన్నాయి. పవన్ సమకూర్చిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని ఇంటెన్స్‌ను, టెన్షన్‌ను అమాంతం పెంచేసాయి. అక్షర్ అలీ కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించింది. మాధవ్ ఎడిటింగ్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండి బాగా ప్లస్ అయింది. దర్శకుడు శశిధర్ మున్నంగి హీరో, విలన్ ట్రాక్స్‌ను సమాంతరంగా నడిపిన తీరు బాగుంది కానీ, చివరి ఎపిసోడ్స్ రాసుకోవడంలో ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే అద్భుతమైన ఫలితం దక్కేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రుద్రవనం PS.. డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా..!

Follow Us