AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPhone-16: ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రియులకు యాపిల్ ఐఫోన్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా యువతతో పాటు మధ్య వయస్కులు ఈ ఫోన్ వాడకాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో వచ్చే యాపిల్ ఐఫోన్‌ను తమ డేటా భద్రత కోసం సెలబ్రిటీలు కూడా వాడుతూ ఉంటారు. యాపిల్ కంపెనీ కూడా ప్రతి ఏడాది ఐఫోన్ కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్-16 సిరీస్ అప్‌డేటెడ్ వెర్షన్‌గా అందుబాటులో ఉంది.

IPhone-16: ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
Iphone 16
Nikhil
|

Updated on: Jan 04, 2025 | 3:35 PM

Share

భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-16పై బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన యాపిల్ ఐఫోన్-16ను మొదటగా సెప్టెంబర్ 9, 2024న యాపిల్ తన ‘గ్లో టైమ్’ ఈవెంట్‌లో ప్రారంభించింది. ఇది యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో తాజా ఫోన్. ప్రారంభించే సమయంలో ఐఫోన్-16కు సంబంధించిన బేస్ మోడల్ (128జీబీ) ధర రూ.79,900గా ఉంది. అయితే కానీ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్‌లో రూ.5,000 తగ్గింపుతో రూ.74,900కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా వినియోగదారులు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించి రూ.40,400కి కొనుగోలు సొంతం చేసుకోవచ్చు. 

నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇది జనవరి 1, 2025 నుంచి జనవరి 5 2025 వరకు కొనసాగుతుంది. ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభంతో దాని విభిన్న వేరియంట్‌లు కూడా విడుదలయ్యాయి. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ సేల్ ద్వారా కొనుగోలుదారులు ఐఫోన్ 16ని కేవలం రూ.40,400కే కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గర పాత ఐఫోన్ 14 ఉంటే ఆ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు ఐఫోన్ 16ని రూ.42,400కి కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే కస్టమర్ రూ. 2,000 అదనపు తగ్గింపును పొందుతారు.

ఐఫోన్ 16 ప్రత్యేకతలు

ఐఫోన్ 16 ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే యువతను అమితంగా ఆకర్షిస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఐఫోన్ 16లో ఏ18 ప్రాసెసర్ ఇవ్వబడింది. ఈ చిప్‌సెట్ ఏ16 బయోనిక్ కంటే 30 శాతం వేగవంతమైనదని ఆపిల్ చెబుతున్నారు. ఐ ఫోన్ -16లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఉంది. కెమెరా సెన్సార్ మాక్రో ఫోటోగ్రఫీకి కూడా మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి