Space Wastage: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!

ప్రయోగాలు పెరిగిపోతుండడంతో అంతరిక్షానికి ముప్పు చేకూరుస్తుందన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. విపరీతమైన ప్రయోగాల కారణంగా…

Space Wastage: అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!
Nasa
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 12, 2021 | 5:51 PM

Space Wastage increasing day by day: అంతరిక్ష ప్రయోగాలు (SPACE EXPERIMENTS) పెరిగిపోతుండడం అందరికీ శాస్త్ర సాంకేతిక (SCIENCE TECHNOLOGY) రంగాల అభివృద్ధిగానే కనిపిస్తోంది. రాకెట్ల ప్రయోగాలు సక్సస్ అయినపుడు, తద్వారా ఉపగ్రహాలను (SATELLITES) అంతరిక్షం (SPACE)లోకి ప్రవేశపెట్టినపుడు.. త్వరలో చంద్రయాన్ (CHANDRAYAAN) జరుగుతుందన్న వార్తలు కనిపించినపుడు.. ఆ వార్తలు చూసి మానవాళి సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక పురోగతి అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ.. ప్రయోగాలు పెరిగిపోతుండడంతో అంతరిక్షానికి ముప్పు చేకూరుస్తుందన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో (SPACE SCIENTISTS) వ్యక్తమవుతోంది. విపరీతమైన ప్రయోగాల కారణంగా అంతరిక్షంలో చెత్తా చెదారం (SPACE WASTAGE) పేరుకుపోతోందని, ఈ వ్యర్థాల కారణంగా అంతరిక్షం కలుషితమైపోతోందని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపగ్రహాలు, వ్యోమనౌకలు (SPACE SHIPS), రాకెట్ల ప్రయోగాలు విజయవంతమైతే పరిశోధకులు, ఆ సంస్థలతోపాటు సామాన్య ప్రజలు కూడా సంబరపడిపోతారు. నిప్పులు చిమ్ముకుంటూ పైకేగసే రాకెట్లను చూస్తే ఎక్కడా లేని గర్వంతో కూడా ఆనందం పలువురిలో కనిపిస్తోంది. కౌంట్ డౌన్ (COUNT DOWN) పూర్తయ్యి.. రాకెట్ల ఇగ్నైట్ అయి అంతరిక్షంవైపు దూసుకుపోతుంటే సామాన్యుల కళ్ళలో సైతం వెలుగులు చూస్తాం. కానీ.. ఈ విపరీతమైన ప్రయోగాలు అంతరిక్షానికి చెడు చేకూరుస్తున్నాయంటూ తాజాగా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను పరిగణలోకి తీసుకున్న ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యర్థాల తగ్గింపునకు ఓ కమిటీని నియమించింది. అమెరికా (AMERICA), రష్యా (RUSSIA)లకు చెందిన స్పేస్ ఏజెన్సీ (SPACE AGENCY)లు అంతరిక్షంలో భారీ వ్యర్థాలను గుర్తించాయి. కాలపరిమితి తీరిపోయిన ఉపగ్రహాలు అంతరిక్షంలో పేరుకుపోయినట్లు స్పేస్ ఏజెన్సీలు ప్రకటించాయి. మండిపోయి పడిపోయిన వివిధ రాకెట్ల శకలాలు కూడా పెద్ద సంఖ్యలో వున్నట్లు స్పేస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

1957లో అంతరిక్ష ప్రయోగాలు నాందీ పడింది. అప్పట్నించి ఇప్పటి వరకు మొత్తం 8950 ఉపగ్రహాలను వివిధ దేశాలు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాయి. వివిధ పరిశోధనల కోసం ఆ ఉపగ్రహాలను ప్రయోగించాయి. అయితే.. ఈ ఉపగ్రహ ప్రయోగాల కారణంగా 2013 జులై నాటికి 1 సెంటీమీటర్ కంటే చిన్న వస్తువులు 17 కోట్లు, 1 సెంటీ మీటర్ నుంచి 10 సెంటీమీటర్ల పొడవున్న వస్తువులు 9 లక్షల 70 వేలు, 10 సెంటీమీటర్ల కంటే పెద్దవై వస్తువులు 33 వేలు అంతరిక్షంలో వుండిపోయాయయని అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు వెల్లడించాయి. అయితే 5 సెంటీమీటర్ల కంటే పెద్దవైన వస్తువు అంతరిక్షంలో 2009 నాటికి కేవలం 19 వేలు మాత్రమే వుండగా.. ఆ తర్వాత నాలుగేళ్ళలో అంతరిక్ష వ్యర్థాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. సెంటీమీటర్ కంటే చిన్నవైన వస్తువులు అంతరిక్షంలో కోటికి పైగానే వుండొచ్చని స్పేస్ ఏజెన్సీలకు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంతరిక్షంలో వ్యర్థంగా వుండిపోయిన వస్తువులు అతివేగంగా తిరుగులున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం పని చేస్తున్న ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. గంటకు 30 వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోని వ్యర్ద పదార్దం ప్రయాణిస్తోందని, ఈ వేగంతో ఏ ఉపగ్రహానికి చిన్న ముక్క తాకినా ఆకాశంలో సంభవించేది ఇక భారీ పేలుడేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే మనం ప్రయోగించనున్న ఉపగ్రహాలకు తీవ్రఆటంకంగా ఈ అంతరిక్ష వ్యర్దాలు పరిణమిస్తున్నాయన్నమాట. ఇవి ఇలాగే కొనసాగితే రానున్న ఐదు, పదేళ్లలో అంతరిక్షంలో ఉపగ్రహాల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయని నాసా తాజాగా వార్నింగ్ ఇచ్చింది.

సమాచార మార్పిడి, నావిగేషన్‌ (NAVIGATION), స్మార్ట్ ఫోన్ల (SMART PHONES) వినియోగం, వైర్‌లైస్ (WIRELESS)‌ పరికరాల వినియోగానికి ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. అంతరిక్ష వ్యర్థాలతో ఇలాంటి ఉపగ్రహాలకు ఆటంకం వాటిల్లితే.. దాని ప్రభావం ప్రపంచ మార్కెట్ (WORLD MARKET)‌పై పడి.. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలతాయని అంఛనా వేస్తున్నారు. 2014లో ఇస్రో (ISRO) చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-3కి ఓ గ్రహశకలం అడ్డురాగా.. ప్రయోగానికి ముందు దానిని గుర్తించి.. ఒక నిమిషం పాటు ప్రయోగాన్ని వాయిదా వేశాకె శాస్త్రవేత్తలు. 2016లో కూడా ఇలాంటి ఘటననే ఎదురైంది. 1979-80 ప్రాంతంలో స్కైలాబ్‌ అనే రాకెట్‌ వ్యవహారం యావత్ భారత దేశాన్ని ఉక్కిరిబిక్కిర చేసింది. స్కైలాబ్ పడే ప్రమాదం వుందన్న పుకార్ల నేపథ్యంలో దేశ ప్రజలందరు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కు మంటూ నెలల తరబడి బతికారు. తీరా ఆ స్కైలాబ్‌ను సముద్రంలో పడేలా చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

2007లో ఫెన్‌గ్యూన్-1సీ ఉప్రగహాన్ని చైనా పేల్చి వేయడంతో అంతరిక్షంలో ఒక్కసారిగా వ్యర్ధాలు పెరిగిపోయాయి. 2009లో అమెరికాకు చెందిన ఇరిడియమ్ 33 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను రష్యాకు చెందిన కాస్మోస్ 2251 స్పేస్ క్రాఫ్ట్‌ ఢీకొంది. ఈ రెండు ఘటనలతో అంతరిక్షంలో శిథిల రేణువుల సంఖ్య బాగా పెరిగిపోయింది. 1978 నుంచే అంతరిక్ష వ్యర్దాలపై పరిశోధనలు మొదలయ్యాయి. అంతరిక్ష శాస్త్రవేత్త డొనాల్డ్ కెస్లర్‌ ఆధ్వర్యంలో అంతరిక్ష వ్యర్థాలపై విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరిగాయి. అప్పట్నించి డొనాల్డ్ క్లెసర్ పేరిట డొనాల్డ్ క్లెసర్ సిండ్రోమ్ అనే పదం వాడుకలోకి వచ్చింది.

అంతరిక్ష వ్యర్ధాల నివారణకు కొత్త కొత్త పద్దతులతో ఆధునాతన టెక్నాలజీ ముందుకొస్తోంది. మరోవైపు నాసా ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రమాదాల నివారణకు కృషి జరుగుతోంది. అంతరిక్షంలో వాహనాల ప్రమాదాలు జరగకుండా నాసా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో స్పేస్ డెబ్రిస్ సెన్సార్‌ను నాసా ఏర్పాటు చేసింది. మిల్లీ మీటర్ సైజ్ వ్యర్థాలను కూడా ఈ సెన్సార్ గుర్తించనున్నది. వ్యర్థాల పయనం ఎటువైపు కొనసాగుతోంది.. వాటి సైజు, బరువు ఎలా వున్నాయి.. అవి ఏ కక్ష్యలో పయనిస్తున్నాయి.. వంటి అంశాలను నాసా పరిశోధనా సంస్థ గుర్తిస్తోంది. వీటిలో దేన్నైనా మరోదైనా వ్యర్థం ఢీ కొనే అవకాశాలుంటే వెంటవెంటనే సంబంధిత సంస్థలకు హెచ్చిరకలను జారీ చేస్తోంది నాసా. అయితే అంతరిక్షంలో తిరుగుతున్న వ్యర్థాలు మానవ ప్రయోగాల కారణంగా ఉద్భవించాయా లేక అంతరిక్షంలోనే ఆ వ్యర్థాలు ఏర్పడ్డాయా అన్న అంశాలపై కూడా స్పష్టత ఇవ్వనున్నది డెబ్రిస్‌ సెన్సార్‌. అంతరిక్ష వ్యర్థాలను పసిగట్టేందుకు బ్రెజిల్‌ ఓ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందంపై రష్యా స్పేస్ ఏజెన్సీ సంతకం చేసింది కూడా.

మరోవైపు అంతరిక్ష వ్యర్థాలను గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీ రూపొందించాయి కొన్ని జపాన్ కంపెనీలు. లేజర్‌ టెక్నాలజీ వ్యర్ధాలను లేజర్‌ కిరణాలతో అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే పరికరాన్ని వారు రూపొందించారు. జపాన్‌కు చెందిన స్కై పర్ఫెక్ట్‌ జేశాట్‌ కార్పొరేషన్‌ అనే కంపెనీ పెద్ద శకలాలను లేజర్‌ కిరణాలతో చిన్న చిన్న ముక్కలుగా చేసే విధానాన్ని రూపొందించింది. అలాంటి ముక్కలను భూవాతావరణంలోకి రప్పించి వాటిని శిథిలాలుగా మార్చేందుకు ప్లాన్ చేశారు. 2026 నుంచి ఈ ప్రయోగాన్ని అమలులోకి తెస్తామంటుని స్కై పర్ఫెక్ట్‌ జేశాట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను మ్యాగ్నటిక్‌తో ఆకర్షించేందుకు మరో జపాన్ సంస్థ కొత్త టెక్నాలజీని కనుగొన్నది. ఈ టెక్నాలజీని జపాన్‌కి చెందిన ‘ఆస్ట్రోస్కేల్‌’ అనే సంస్థ తయారు చేసింది.

2021 మార్చి 22న రష్యా నుంచి ఈఎల్‌ఎస్‌ఏ-డీ శాటిలైట్‌ ను ప్రయోగించారు. ఈ మిషన్‌లో 175 కిలోల బరువున్నరెండు ఉపగ్రహాలున్నాయి. సర్వీసర్‌ అనే ఉపగ్రహంపై ప్రత్యేకమైన అయస్కాంత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఉపగ్రహ వ్యర్ధాలను ఆకర్షించి.. మిషన్‌కు సర్వీసర్‌ అనుసంధానం చేయనున్నది. వ్యర్ధాలను సంచి లాంటి నిర్మాణంలో సర్వీసర్ సేకరించనున్నది. వ్యర్ధాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని సర్వీసర్‌కు చేరవేయనున్నది మరో ఉపగ్రహం క్లైంట్‌. ఇలా అంతరిక్ష వ్యర్ధాల సేకరణకు వివిధ కంపెనీలు, సంస్థలు ముందుకు వస్తున్నాయి.

ALSO READ: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!