Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Pandemic: గట్టిగా అంకెలు లెక్కబెడితే.. కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. అయితే.. !

Coronavirus Pandemic:గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. జనజీవనం...

Coronavirus Pandemic: గట్టిగా అంకెలు లెక్కబెడితే.. కరోనా ఉందో లేదో చెప్పేస్తున్న యాప్.. అయితే.. !
App Vocalischeck
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2021 | 3:23 PM

Coronavirus Pandemic:గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై ప్రాభవం చూపించింది. ఓ వైపు కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఇస్తూనే ఉన్నారు.. మరోవైపు బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కరోనా రూపు మార్చుకుని .. విజృంభిస్తుంది. ఇక మరికొన్ని దేశాల్లో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తోంది.

ఈ సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాల్లో మార్పులు వచ్చాయి. అంతేకాదు ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు.. అయినప్పటికీ వారికి కోవిడ్ పాజిటివ్ గా నమోదవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అయితే కొంతమంది సాధారణ జ్వరం, జలుబు వచ్చినా కరోనా అనే ఫీలింగ్ తో టెస్టుల కోసం వెళ్తున్నారు. అయితే అప్పటివరకూ అటువంటి వారికి కరోనా లేకపోయినా.. కోవిడ్ టెస్టులకు వెళ్లి వచ్చిన తర్వాత తమకు కరోనా సోకిందని చెబుతున్న బాధితులున్నారు.

ఇక ఏడాది క్రితం కంటే.. కరోనా నిర్ధారణ కోసం టెస్టుల నిర్వహణ మరింత సులభమయ్యింది. అయితే తాజాగా కరోనా టెస్టుల కోసం వెళ్లే వారి ఇబ్బందులకు చెక్ పెడుతూ… సరికొత్త యాప్ వచ్చింది. అది కూడా పైసా ఖర్చు లేకుండా కోవిడ్ టెస్టులను స్వయంగా సేఫ్ గా చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు వోకలిస్ చెక్. ఈ యాప్ లో ఎవరైనా తమ వాయిస్ ను ఇస్తే.. అది వారి గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది. అయితే ఈ యాప్ పనిచేసే విధానం గురించి వోకలిస్‌ హెల్త్‌ సంస్థ కో ఫౌండర్‌ షేడీ హసన్ వివరించారు. ముందుగా వోకలిస్‌ చెక్‌ యాప్ ను ఓపెన్ చెయ్యాలి. తర్వాత 50 నుంచి 70 వరకూ అంకెలను గట్టిగా లెక్క పెట్టాలి. అప్పుడు ఆ ఆడియో రికార్డ్ అవుతుంది. అనంతరం ఆ ఆడియో స్పెక్టోగ్రామ్‌గా మారి, హీట్‌ ఇమేజ్‌లాగా కనిపిస్తుంది.

అనంతరం ఈ హీట్‌ ఇమేజ్ … కోవిడ్‌ పేషెంట్ల ఆడియోతో పోల్చి కోవిడ్ 19 ఉందో .. లేదో తేల్చి చెప్పేస్తుంది. ప్రస్తుతం స్వరూపం మార్చుకుంటున్న కరోనా ను అతి తక్కువ టైమ్‌లో ఈ యాప్‌తోనిర్ధారించుకోవచ్చునని షేడీ హసన్‌ తెలిపారు. ఎఐ అల్గారిథమ్స్‌ వాయిస్‌ నమూనా నుంచి 512 విభిన్న లక్షణాలను సేకరించడానికి యాప్‌ను రూపొందించారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్‌ కంపెనీ వోకలిస్‌ హెల్త్‌ ఈ యాప్‌ను డెవలప్‌ చేసింది. ఇప్పటికే ఉన్న నమూనాల డేటాబేస్‌కు మీ వాయిస్‌ లక్షణాలను సరిపోల్చడానికి కృత్రిమ మేధస్సు ను ఉపయోగిస్తుంది. కోవిడ్ వలన ఎంత ప్రమాదంలో ఉన్నారో కేవలం రెండు నిమిషాల్లోనే ఈ యాప్ చెప్పేస్తుంది. ఇప్పటికే 2021 ఫిబ్రవరిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబైతో కలిసి వోకలిస్‌ హెల్త్‌ కంపెనీ పలువురు పై కరోనా నిర్ధారణ టెస్టులను చేసింది. సుమారు రెండు వేల మంది వరకూ పేషేంట్స్ ను పలు భాషల్లో వాయిస్ రికార్డ్ చేసి.. పరీక్షించింది. ఈ పరీక్షల్లో 81 శాతానికి పైగా సక్సెస్ రేటు రావడం విశేషం. మరిఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ ను ప్లే స్టార్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.. కరోనా నిర్ధారణ టెస్టులు చేసుకోండి. అయితే కొంతమంది నెటిజన్లు ఈ యాప్.. ఐఫోన్ లో పనితీరు అంతంతమాత్రంగా ఉందని.. కరోనా అని అనుమానం వచ్చిన వెంటనే వైద్యున్ని సంప్రదించామని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చిన పాదాచారుడు.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

అంతరిక్షంలో అంతకంతకూ పెరుగుతున్న చెత్తా చెదారం.. ఫ్యూచర్‌లో జరిగేది ఇదే!