Singireddy Niranjan Reddy: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. ఆ జిల్లా నాయకుల్లో టెన్షన్

Covid-19 Positive: దేశంలో కోరోనావైరస్ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ

Singireddy Niranjan Reddy: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. ఆ జిల్లా నాయకుల్లో టెన్షన్
Singireddy Niranjan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2021 | 3:45 PM

Covid-19 Positive: దేశంలో కోరోనావైరస్ విజృంభిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇటీవల చాలమంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గత రెండురోజులుగా అస్వస్థతగా ఉండడంతో ఆయన కోవిడ్19 పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.

కాగా గత కొన్ని రోజుల నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో శుంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. నిన్న చిన్న చింతకుంట మండల కేంద్రంలో రైతువేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే తాజాగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని కీలక నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని నిరంజన్ రెడ్డి సూచించారు.

తాజగా ఆదివారం తెలంగాణలో 2,251 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,29,529 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,765 కి చేరింది. కాగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కేసుల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. మాస్కు లేకుండా బహిరంగంగా తిరిగే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగ సమావేశాలు తదితర వాటిపై ఆంక్షలు విధిస్తున్నారు.

Also Read: