AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. చిరుజల్లులతో చల్లబడ్డ భాగ్యనగరం

హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో వేడెక్కిన భాగ్యనగరం వర్షపు జల్లులతో చల్లబడింది.

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. చిరుజల్లులతో చల్లబడ్డ భాగ్యనగరం
Hyderabad Rain
Balaraju Goud
|

Updated on: Apr 12, 2021 | 4:21 PM

Share

Rain in grater Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో వేడెక్కిన భాగ్యనగరం వర్షపు జల్లులతో చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అనుకుండా వచ్చిన వర్షంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు.

నగరంలో మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్‌, కాప్రా, మల్కాజిగిరి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్, సికింద్రాబాద్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి తదితర‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.

ఎండలతో ఏప్రిల్‌లోనే ఆపసోపాలు పడుతోన్న హైదరాబాద్ నగర ప్రజలకు చిన్న ఉపశమనం లభించింది. ఇటు అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, జూబ్లిహిల్స్, బంజారా‌హిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లోనూ వర్షం కురుసింది. పగలంతా తీవ్ర ఉక్కపోతతో బాధపడిన నగరవాసులకు ఆహ్లాదంగా అనిపించింది. ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు పడుతుండగా.. హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసినట్లుగా చెబుతోంది వాతావరణశాఖ.

ఇదిలావుంటే గత మూడు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో రాబోయే 24 గంటల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రకారం.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, రాబోయే రెండు రోజుల్లో నగరంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు కురిసే జిల్లాలు హైదరాబాద్, రంగా రెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్, నారాయణపేట, మహబూనగర్. అంతేకాకుండా కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలావుంటే, మధ్యప్రదేశ్, తీర ప్రాంతంలోని కొమొరిన్ ఏరియాలో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం వల్ల వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ తరహా వాతావరణం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు.

Read Also…  Sputnik Vaccine: భారతీయులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..