AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చిన పాదాచారుడు.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Viral Video : మద్యం సేవించి రోడ్లపైకి రావొద్దంటే మందుబాబులు అసలే వినడం లేదు. ఫుల్‌గా మద్యం సేవించి బిజీగా ఉండే రోడ్లపై ఇష్టారీతిన నడుస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడమే

Viral Video : మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చిన పాదాచారుడు.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..
Man On The Road
uppula Raju
|

Updated on: Apr 12, 2021 | 2:59 PM

Share

Viral Video : మద్యం సేవించి రోడ్లపైకి రావొద్దంటే మందుబాబులు అసలే వినడం లేదు. ఫుల్‌గా మద్యం సేవించి బిజీగా ఉండే రోడ్లపై ఇష్టారీతిన నడుస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడమే కాకుండా అనవసరంగా ప్రమాదాలకు గురవుతున్నారు. చావును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపై నడుస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తి బాగా మద్యం తాగి రద్దీగా ఉన్న రోడ్డుపై అడ్డదిడ్డంగా నడుస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. తుళ్లుతూ నడుస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్కుకి తగిలి కిందపడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. డ్రంకెన్‌ డ్రైవ్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి బండి నడపొద్దని పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. వాళ్ల లైఫ్‌ రిస్క్‌లో పడ్డమే కాదు..ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. తాగుబోతులు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారుతున్నారు. ఇటీవల ఓ యువకుడు చేసిన పనికి ఓ ఏఎస్ఐ బలైన సంగతి తెలిసందే.

ఇటీవల కూకటపల్లి నిజాంపేట క్రాస్‌ రోడ్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా..ఓ కారు దూసుకు వచ్చింది. సృజన్‌ అనే బిటెక్‌ స్టూడెంట్‌ ఫుల్‌గా మందేసి కారులో రోడ్డెక్కాడు. పోలీసులను చూసి ఎస్కేపయ్యే ప్రయత్నంలో పిల్లర్‌ను ఢీకొట్టాడు. అదే టైమ్‌లో ఏఎస్‌ఐ మహిపాల్‌ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆరా తీస్తున్న క్రమంలోనే క్యాబ్‌ దూసుకొచ్చి మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిపాల్‌ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మహిపాల్‌ కన్నుమూసారు.

ఈ వీడియో చూడండి :

Sailajanath : వైసీపీకి 23వ ఎంపీ ఎందుకో అర్థం కావడం లేదు, ప్రచారంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sharad Pawar: పక్షం రోజుల్లో శరద్ పవార్ ‌కు రెండో సర్జరీ.. ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే..

Weather Report: హైదరాబాద్‌కి వర్ష సూచన.. ఇతర జిల్లాల్లో ఉరుములతో కూడిన వాతావరణం..