Sharad Pawar: పక్షం రోజుల్లో శరద్ పవార్ ‌కు రెండో సర్జరీ.. ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే..

Sharad Pawar: అనారోగ్యంలో బాధపడుతున్న ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌కు మరోసారి శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో శరద్ పవార్‌ శస్త్రచికిత్స..

Sharad Pawar: పక్షం రోజుల్లో శరద్ పవార్ ‌కు రెండో సర్జరీ.. ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే..
Sharad Pawar
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 12, 2021 | 2:43 PM

Sharad Pawar: అనారోగ్యంలో బాధపడుతున్న ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌కు మరోసారి శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో శరద్ పవార్‌ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు మహారాష్ట్ర మంత్రి నవాల్ మాలిక్ వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ ఆదివారం నాడు బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. ఆ సందర్భంగా ఆయనను పరిశీలించిన వైద్యులు.. ఆయనకు శస్త్రచికిత్స చేశారు. శరద్ పవార్ ఆరోగ్య వివరాలను మంత్రి మాలిక వెల్లడించారు. ‘మా పార్టీ అధినేత శరద్ పవార్ పిత్తాశయంలో సమస్య కారణంగా ఆస్పత్రి చేరారు. డాక్టర్ బల్సారా ఆయనకు లాప్రోస్కోపీ శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది.’ అని మాలిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా లాప్రోస్కోపీ ద్వారా సురక్షితమైన శస్త్రచికిత్స చేయవచ్చునని వైద్యులు తెలిపారు.

కాగా, అంతకుముందు మార్చి నెలలో శరద్ పవార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పిత్తాశయంలో సమస్య ఉత్పన్నమవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని తెలిపారు. దాంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మార్చి 30వ తేదీన శరద్ పవార్‌కు పిత్తశయంలో ఏర్పడిన రాయిని తొలగించడం కోసం ఎండోస్కోపీ చేశారు. ఆ ఆపరేషన్ విజయంతం అయ్యింది. అయితే కనీసం ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మళ్లీ 15 రోజుల తరువాత ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు శరద్ పవార్ విశ్రాంతి తీసుకున్నారు. ఆయన షెడ్యూల్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తాజాగా మళ్లీ ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇవాళ ఉదయమే శరద్ పవార్‌కి శస్త్ర చికిత్స జరిగినట్లు మంత్రి మాలిక్ తెలిపారు.

కాగా, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర సర్కారులో ఎన్సీపీ భాగస్వామ్యం ఎంతో కీలకం.

Also read:

తెలుగువారు ఉగాదిగా, మహరాష్టీయులు గుడిపాడ్వగా, మలయాళీలు విషుగా, తమిళులు పుత్తాండుగా జరుపుకునే సంవత్సరాది!

Goat milk benefits: లైంగిక శక్తి పెరుగుదల, ఎముకల ధృడత్వం…మేక పాలతో ఎన్నో ప్రయోజనాలు…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?