Sailajanath : వైసీపీకి 23వ ఎంపీ ఎందుకో అర్థం కావడం లేదు, ప్రచారంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
PCC chief Sailajanath : దేశాన్ని అమ్మేస్తోన్న నరేంద్ర మోదీ మనుషులను అమ్మేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అన్నారు..
PCC chief Sailajanath : దేశాన్ని అమ్మేస్తోన్న నరేంద్ర మోదీ మనుషులను అమ్మేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అన్నారు. ఈరోజు తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మన జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, జగన్ లు మాట మీద నిలబడని దుర్మార్గమైన పాలకులని ఘాటు విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలతో మోదీకి దండాలు పెడుతున్న వైసీపీకి 23వ ఎంపీ ఎందుకో అర్థం కావడం లేదని శైలజానాథ్ సందేహం వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసే బాధ్యత తమదేనని శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనీ, హస్తం గుర్తుకు ఓటేసి చింతా మోహన్ ను ఎంపీగా గెలిపించాలని ఆయన తిరుపతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, తిరుపతి బైపోల్ ప్రచారంలో బస్తీమే సవాళ్లు నడుస్తున్నాయి. రాజీనామా అస్త్రాలుగా డైలాగ్ వార్ సాగుతోంది. ఒకరు హోదా కోసం రాజీనామాకు పట్టుబడితే.. మరొకరు ఓడిపోతే తప్పుకుంటామంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం వెంకన్న సన్నిధిలో మరింత హీట్ పెంచుతోంది. పార్లమెంటులో పులిలా.. మోదీ దగ్గర పిల్లిలా ఉండే పార్టీని గెలిపించి లాభమేంటని నిలదీసిన మంత్రి పెద్దిరెడ్డి… టీడీపీకి స్ట్రాంగ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో తాము ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని, మీరు ఓడిపోతే చేస్తారా అంటూ టీడీపీని ప్రశ్నించారు. దాంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం అందరం రాజీనామా చేద్దామని, అప్పుడు తాము ఓడిపోతే ఏకంగా పార్టీనే మూసేస్తామని అచ్చెన్న అనడం మరింత చర్చకు దారితీసింది.
అధికార, ప్రతిపక్ష పార్టీల తీరు ఇలా ఉంటే.. బీజేపీ మిగతా పక్షాలు కూడా తామేమి తక్కువ కాదన్నట్టుగా పంచ్‌లు పేలుస్తున్నాయి. సీఎం జగన్ తిరుపతి టూర్ రద్దు వెనుక బీజేపీ భయం ఉందని ఆ పార్టీ నేతలు అంటుంటే… వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీకి కట్టుబానిసలంటూ సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read also : Tribal Women : అడవి బిడ్డల ఆగ్రహావేశాలు..పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజన మహిళలు..