Tribal Women : అడవి బిడ్డల ఆగ్రహావేశాలు..పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజన మహిళలు..
Tribal women attacks : గిరిజన బిడ్డల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ నోటి దగ్గర కూడు కోల్పోతున్నామనే ఆవేశమో.. మరొకటో.. ఏకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను చెట్టుకు కట్టి చితకబాదారు...
Tribal women attacks : గిరిజన బిడ్డల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ నోటి దగ్గర కూడు కోల్పోతున్నామనే ఆవేశమో.. మరొకటో.. ఏకంగా పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను ఇలా చెట్టుకు కట్టి కర్రలతో మోదిన వాళ్లంతా గిరిజన మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దుమ్ముగూడెం మండలం తొగ్గుడెంలో జరిగింది. స్థానిక గిరిజనం సాగుచేస్తోన్న పొడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపై గిరిజనం తమ ఆగ్రహాన్ని అలా వెళ్లగక్కారు.
కాగా, అటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే తరహా ఉదంతం చోటుచేసుకుంది. కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగమైంది. గిరిజనులకు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు మధ్య ఒక రకమైన యుద్ధవాతావరణం నెలకొంది. బీట్ ఆఫీసర్లపై గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మహిళా బీట్ ఆఫీసర్లకు కూడా గాయాలయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని గిరిజనం కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అటు, బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులపాటు కొండపల్లి అటవీ ప్రాంతంలో నిరవధిక దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి దీక్షా శిబిరం దగ్గరకు జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ, పెంచికల్‌పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు.
Read also : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సీఐడీ సోదాలు, ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..