Sputnik Vaccine: భారతీయులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..

రష్యా అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాధికి విరుగుడుగా కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం సోమవారం ఆమోదం తెలిపింది.

Sputnik Vaccine: భారతీయులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 12, 2021 | 3:51 PM

Sputnik Vaccine Cleared: రష్యా అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాధికి విరుగుడుగా కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ తరువాత భారతదేశం ఆమోదించిన మూడవ టీకా ఇది కావడం విశేషం.

ఒక‌వైపు క‌రోనాను ధీటుగా ఎదుర్కొనాలంటే వ్యాక్సినేష‌నే ఉత్తమ ప‌రిష్కార మార్గమ‌ని నిపుణులు చెబుతూ ఉన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా క‌రోనా వైర‌స్ సోకితే సోక‌వ‌చ్చు. అయితే, అలాంటి వారిపై ఆ వైర‌స్ ప్రభావం మాత్రం చాలా త‌క్కువగా ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను న‌మ్మవ‌చ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

అరుదుగా మాత్రమే వీటి వ‌ల్ల దుష్ప్రభావాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. అలాగే వ్యాక్సినేష‌న్ విష‌యంలో వేగంగా అడుగులు వేసిన వివిధ దేశాల్లో కొత్తగా కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని కూడా మీడియా సంస్థలు చెబుతున్నాయి. 60 శాతం ప్రజ‌ల‌కు మించి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో కొత్త కేసుల సంఖ్య చాలా త‌గ్గిపోయాయ‌ని అధ్యయ‌న సంస్థలు కూడా చెబుతున్నాయి.

భారత్‌లో వ్యాక్సిన్‌ కొరత తీవ్రమవుతోంది. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. అక్టోబర్‌ నాటికి భారత్‌లో మరో ఐదు వ్యాక్సిన్లు అందుబాటు లోకి రాబోతున్నాయి. రష్యాకు చెందిన స్నుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించడానికి అనుమతిచ్చారు. ఇదే క్రమంలో భారత్‌లో మూడో టీకా అందుబాటు లోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి స్పుత్నిక్‌ వ్యాక్పిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌తో పాటు ఐదు కంపెనీలు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీకి రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ , హెటిరో బయో ఫార్మా , గ్లాండ్‌ ఫార్మా , స్టెల్లీస్‌ బయో ఫార్మా , విచ్రో బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

సెకండ్‌ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ విలయతాండవంతో.. లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 12 లక్షలకు పైగా కేసులున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు రెండు రకాల కరోనా టీకాలను అందిస్తోంది.

తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకాలు అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 10కోట్ల 45 లక్షల 28వేల 565​ డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదిలావుంటే, దేశంలో అనేక రాష్ట్రాలను టీకా కొరత వేధిస్తోంది. డిమాండ్‌కు తగ్గ సప్లైని కేంద్రం చేయడం లేదంటూ అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర సర్కార్‌ కూడా మరోసారి కేంద్రంపై విరుచుకుపడింది. టీకా ఉత్సవ్‌ చేస్తున్న కేంద్రం.. అందుకు తగ్గట్టు వ్యాక్సిన్లను సరఫరా చేయదా అని ప్రశ్నించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ సహా కఠినమైన ఆంక్షలు విధించడం అనివార్యమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే చెప్పారు. కానీ, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అటు.. రోజుకు లక్షల్లో నమోదవుతున్న కేసులతో.. భారత్‌.. ప్రపంచంలోనే రెండోస్థానంలోకి చేరింది.

Read Also… Singireddy Niranjan Reddy: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. ఆ జిల్లా నాయకుల్లో టెన్షన్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే