AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar Covid: కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ హీరో… ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటోన్న ఆయన సతీమణి..

Akshay Kumar Covid: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో చికిత్సలో భాగంగా అక్షయ్‌ ఆసుపత్రిలో కూడా చేరారు. ఈ విషయాన్ని అక్షయ్...

Akshay Kumar Covid: కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ హీరో... 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అంటోన్న ఆయన సతీమణి..
Twinkle Khanna About Akshay
Narender Vaitla
|

Updated on: Apr 12, 2021 | 4:16 PM

Share

Akshay Kumar Covid: కరోనా సెకండ్‌ వేవ్‌ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా సినిమాల పేరుతో షూటింగ్‌ల కోసం పలు ప్రదేశాలు తిరుగుతోన్న సినీ తారలకు కరోనా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో చికిత్సలో భాగంగా అక్షయ్‌ ఆసుపత్రిలో కూడా చేరారు. ఈ విషయాన్ని అక్షయ్‌ వ్యక్తిగతంగా తన అభిమానులతో పంచుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే హాస్పిటల్‌లో చేరానని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఆరోగ్యం నుంచి కోలుకుంటానని ఎవరూ ఆందోళన చెందొద్దంటూ పోస్ట్ చేశారు. చెప్పిన విధంగానే అక్షయ్‌ తక్కువ సమయంలోనే కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వైద్యుల సూచన మేరకు అక్షయ్‌ కుమార్‌ సోమవారం ఆసుప్రతి నుంచి డిశ్చార్చ్‌ అయ్యారు. అక్షయ్‌ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు ఆయ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే అక్షయ్‌, ట్వింకిల్‌ ఖన్నా కలిసి ఉన్నట్లు రూపొందించిన ఓ కార్టూన్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్వింకిల్‌.. ‘ఆయన (అక్షయ్‌) తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోంది’ అంటూ క్యాప్షన్‌ జోడించడంతో పాటు ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. దీంతో అక్షయ్‌ కుమార్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అక్షయ్‌ ఇంటికి చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ ట్వింకిల్‌ ఖన్నా చేసిన పోస్ట్‌..

Also Read: రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..

మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..

Vakeel Saab Movie : ఒడిశాలో “వకీల్‌ సాబ్‌” కి షాక్‌..! రెండు థియేటర్లు సీజ్‌.. ఎందుకో తెలుసా..?