AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..

Rajini Kanth And Kamal Hasan: సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ హీరో కమల్ హసన్ ఇద్దరు మళ్లీ పోటీపడుతున్నారు. అదేంటి మళ్లీ రజినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా ?

మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..
Kamal Haasan Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2021 | 11:16 AM

Share

Rajini Kanth And Kamal Hasan: సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ హీరో కమల్ హసన్ ఇద్దరు మళ్లీ పోటీపడుతున్నారు. అదేంటి మళ్లీ రజినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా ? అని మాత్రం అనుకోకండి.. అదేం లేదండి.. వీరిద్దరూ పోటీ పడబోతుంది సినిమాల్లో. తమిళ ఇండస్ట్రీకి వీరిద్దరు రెండు కళ్ళలాంటి వారు. ఆది నుంచి వీరిద్ధరు మంచి స్నేహితులు. బాక్సాఫీసు దగ్గర వీరి సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజినీ కాంత్ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు.. అటు కమల్ లోకేశ్ నాగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు దీపావళి బరిలోకి రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఇదే కనుక నిజమైనతే కమల్, రజినీ ఇద్దరూ దాదాపు 16 ఏళ్ళ తర్వాత బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నట్లే.

ప్రస్తుతం రజినీ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఇందులో సూపర్ స్టార్ ఓ గ్రామ పెద్ద పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. అటు కమల్ విక్రమ్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఇద్దరూ టాప్ హీరోలు ఎవరి సినిమాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. అనుకున్న సమయానికి ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తైతే.. ఒకేసారి విడుదల అయ్యే అవకాశం మాత్రం కచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. దీంతో చాలా కాలం తర్వాత ఈ బడా హీరోల సినిమాలు ఏకకాలంలో బాక్సాఫీసు దగ్గర ఢీకొట్టబోతున్నాయి. గతంలో వీరిద్దరు నటించిన చంద్రముకి, ముంబై ఎక్స్ ప్రెస్ సినిమాలు 2005లో ఒకేసారి విడుదల అయ్యాయి. ఇక మళ్లీ అన్నాత్తే, విక్రమ్ సినిమాల రూపంలో ఆ సీన్ రీపిట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న ‘థ్యాంక్యు’.. ఇటలికి పయనమైన నాగచైతన్య…

ఫ్యాన్స్ బీ రెడీ.. ఆ సినిమాపై బిగ్ అనౌన్స్‏మెంట్ ఇవ్వనున్న మేకర్స్.. ఆ స్టార్ హీరోల చిత్రాలపై స్పష్టత..