Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న ‘థ్యాంక్యు’.. ఇటలికి పయనమైన నాగచైతన్య…

Thank You Movie Update: అక్కినేని నాగచైతన్య ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు.

Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న 'థ్యాంక్యు'.. ఇటలికి పయనమైన నాగచైతన్య...
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 12, 2021 | 7:08 AM

Thank You Movie Update: అక్కినేని నాగచైతన్య ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అందమైన ప్రేమ కథ చిత్రం లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు చై. ఇందులో నాగచైతన్యకు జోడీగా హైబ్రిడ్ పిల్లా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ మూవీ రిలీజ్‏ను చిత్రయూనిట్ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మళ్లీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. నాగచైతన్య అటు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఫ్యామిలి ఎంటర్ టైనర్ ‘థ్యాంక్యు’ సినిమా చేస్తున్నాడు. ఇందులో చైతన్య మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతల్లో చిత్రీకరణ పూర్తిచేసున్న థ్యాంక్యు టీం.. తాజాగా కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ఇటలీకి వెళ్ళనున్నారట. ఇటలీలోనే కొన్ని సీన్స్‏తోపాటు సాంగ్స్ కూడా షూట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇందుకోసం నాగచైతన్య అండ్ టీం త్వరలోనే ఇటలీకి వెళ్ళనున్నారట. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చై సరసన రాశి ఖన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా.. మాలవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2021 ద్వితీయార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Also Read: షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‏లో ఉన్న శ్యాం సింగరాయ్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే