షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ హీరో.. రాధకృష్ణ కుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ

షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2021 | 6:02 PM

Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ హీరో.. రాధకృష్ణ కుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించాగా.. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‏తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అవి.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే అటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’‏లోనూ నటిస్తున్నాడు ప్రభాస్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది.

Prabhas Throwback Picture

Prabhas Throwback Picture

తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్‏కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో డార్లింగ్ మునీశ్వరుడి గెటప్‏లో ఉన్నాడు. అయితే ప్రభాస్ ఏ సినిమాలో మునీశ్వరుడిగా కనిపించాడు అని డౌట్ వస్తుంది కదూ. కానీ ఈ లుక్ తన సినిమా కోసం కాదండోయ్. విశ్వామిత్ర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ కోసం ఇలా రెడీ అయ్యాడు ప్రభాస్. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు. అయితే ఈ బ్యానర్ లోగో కోసం విశ్వామిత్రుడి గెటప్ కావాల్సి వచ్చింది. అయితే ఈ వేషం కోసం ప్రభాస్ సరిగ్గా సెట్ అవుతాడని భావించారట. అందుకోసమే డార్లింగ్ విశ్వామిత్రుడిగా మారిపోయాడు. ఈ బ్యానర్ పై రాజమౌలి యమదొంగ తర్వాత మరే చిత్రాన్ని నిర్మించలేదు. ప్రస్తుతం రాజమౌళి భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియన్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Corona Effect On Tollywood: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా సంక్షోభం.. నిర్మాతల్లో గుబులు.. ఇండస్ట్రీలో ఆవేదన

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..