AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect On Tollywood: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా సంక్షోభం.. నిర్మాతల్లో గుబులు.. ఇండస్ట్రీలో ఆవేదన

సిల్వర్‌ స్క్రీన్‌కు టెన్షన్‌ టైమ్‌ మళ్లీ మొదలైంది. వెండితెరపై వాయిదాల పర్వం కంటిన్యూ అవుతుందా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీని భయపెడుతున్న విషయం.....

Corona Effect On Tollywood: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా సంక్షోభం.. నిర్మాతల్లో గుబులు.. ఇండస్ట్రీలో ఆవేదన
Corona Scare In Tollywood
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2021 | 2:49 PM

Share

సిల్వర్‌ స్క్రీన్‌కు టెన్షన్‌ టైమ్‌ మళ్లీ మొదలైంది. వెండితెరపై వాయిదాల పర్వం కంటిన్యూ అవుతుందా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీని భయపెడుతున్న విషయం.. వకీల్‌ సాబ్‌ భారీ వసూళ్లతో భరోసా ఇస్తున్నా.. ఇదే జోరు ఇంకెన్నో రోజులు కొనసాగే పరిస్థితి లేదన్న వర్షన్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికే 16న రిలీజ్‌ కావాల్సిన లవ్‌ స్టోరి వాయిదా పడింది. 23 డేట్‌కు వస్తా అన్న తలైవి కూడా వెనక్కి తగ్గారు. ఇప్పటి వరకు అయితే టక్‌ జగదీష్‌ మాత్రం రిలీజ్‌ డేట్‌ మీద కాన్ఫిడెంట్‌గానే ఉన్నా.. వసూళ్ల విషయంలో మాత్రం అనుమానాలు అందరి మదిలోనూ ఉన్నాయి.

ఇక నెలాఖరు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందా? ఇలాంటి అనుమానాలే వినిపిస్తున్నా… ఏప్రిల్‌ 30కి విరాటపర్వంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు రానా. అయితే ఈ మూవీ అనుకున్నట్టుగా రిలీజ్ అవుతుందా లేదా అన్న టెన్షన్‌ ఫ్యాన్స్ లో లేకపోలేదు. ఇప్పటికే అరణ్య సినిమా హిందీ వర్షన్‌ వాయిదా పడింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చేయిదాటుతుండటంతో విరాటపర్వం కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వెర్షన్‌ కూడా వినిపిస్తోంది.

మరో రెండు మూడు నెలల్లో కోవిడ్ విజృంభన మరో స్థాయిలో ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మే రిలీజ్‌పై కూడా డౌట్స్‌ రెయిజ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మే 13న ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న ఆచార్య ఏం చేయబోతున్నారు. మెగా రిలీజ్‌కు అవకాశం లేని ఈ టైంలో మెగాస్టార్‌ రిలీజ్‌కే మొగ్గు చూపుతారా..? ఆగి సాగుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ డైమండ్ ఫేస్ మాస్క్.. దాని రేటెంతో తెలిస్తే షాకవుతారు

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో