Pawan Kalyan : వైద్యుల సూచనతో హోంఐసోలేషన్‌లోకి పవన్.. వర్చువల్‌గా పార్టీ కార్యకలాపాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలను అటు సినిమాలను బ్యాలెన్స్ చేతున్నవిషయం తెలిసిందే. ఓ వైపు ప్రజలతరఫున పోరాడుతూ.. మరో వైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో నివేద థామస్, అంజలీ, అనన్య నాగళ్ళ నటించారు.
ఇదిలా ఉంటే ఈసినిమాలో కీలక పాత్ర పోషించిన నివేద థామస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ అంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా సోకడంతో నివేద వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. ప్రీరిలీజ్ తర్వాత మరో నటి అంజలీ కరోనా భారిన పడిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది అంజలీ. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈమేరకు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ప్రకటనను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, కార్య నిర్వాహకులు, సన్నిహితుల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో పవన్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. సిబ్బందితో ఆయన చాలా దగ్గరగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా… కరోనా విస్తృతిని అడ్డుకుకోవడానికి పవన్ క్వారంటైన్ కు వెళ్లారని తెలిపారు. డాక్టర్ల సూచనమేరకు ప్రశాంత వాతావరణంలో ఆయన సమయాన్ని గడుపుతున్నరని… అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తూ.. కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని సిద్ధం చేస్తున్న కీరవాణి…
Gangubai Kathiawadi : ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు..
vakeel saab: పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను వీక్షిణించిన మెగా ఫ్యామిలీ… ( వీడియో )