RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని సిద్ధం చేస్తున్న కీరవాణి…

టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు రాజమౌళి. ప్రస్తుతం జక్కన్న మరో ప్రతిష్టాత్మక సినిమాను

  • Rajeev Rayala
  • Publish Date - 12:18 pm, Sun, 11 April 21
RRR Movie : 'ఆర్ఆర్ఆర్'సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని సిద్ధం చేస్తున్న కీరవాణి...
Rrr

RRR Movie: టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు రాజమౌళి. ప్రస్తుతం జక్కన్న మరో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అదే ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు రాజమౌళి. మన్యం వీరుడు, గిరిజన వీరుడు కొమరం భీమ్ ను కలపనున్నాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి తారక్, చరణ్ కు సంబందించిన టీజర్స్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ రెండు టీజర్స్ సినిమా ఆసక్తిని పెంచాయి. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి గెటప్ లో చరణ్ లుక్ ను రిలీజ్ చేసాడు జక్కన్న. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళికి కీరవాణి ఆస్థాన సంగీత దర్శకుడు. రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా అదిరిపోయే సంగీతాన్ని సిద్ధంచేస్తున్నారట కీరవాణి. సినిమా ఎంత గ్రాండియర్ గా ఉన్న దానికి తగ్గ సంగీతం లేకుంటే ఎదో లోటుగా ఉంటుంది. కానీ కీరవాణి ఎప్పుడు తన సంగీతంతో సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్తుంటారు. అలాగే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆర్ఆర్ పనిలో బిజీగా ఉన్నారు కీరవాణి. తాజాగా బాలీవుడ్ సంగీతదర్శకుడు.. గాయకుడు పాటల రచయిత విశాల్ మిశ్రా  ట్విట్టర్ లో రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి ఉన్నారు. “మేం ఈ రోజు స్టూడియోలో మ్యాజిక్ చేసాం. R.R.R త్వరలో వస్తుంది“ అని విశాల్ చేసిన ట్వీట్ చేసారు. అజయ్ దేవ్గన్ – అలియా భట్- ఒలివియా మోరిస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13 న దాసర కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

vakeel saab: పవన్​ కల్యాణ్​ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను వీక్షిణించిన మెగా ఫ్యామిలీ… ( వీడియో )

Gangubai Kathiawadi : ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు..

Kavita Kaushik: బిగ్ బాస్ వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది.. సంచలన కామెంట్స్ చేసిన నటి