AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

నెమలి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక దాని నెమలిని పట్టుకోవాలని చాలా మందే అనుకుంటారు. దానిని పట్టుకోని ఆటలాడాలని అనుకుంటారు.

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..
Peacock
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 9:23 PM

Share

నెమలి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక దాని నెమలిని పట్టుకోవాలని చాలా మందే అనుకుంటారు. దానిని పట్టుకోని ఆటలాడాలని అనుకుంటారు. కానీ అసలు సాధ్యపడదు. మనం పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవి పారిపోవడం లేదా ఎగిరిపోవడం చేస్తుంటారు. అలా కాకుండా.. వెనక్కు తిరిగి మనమిదే దాడి చేస్తాయని అసలు ఉహించగలమా. కానీ అలాంటిందే జరిగింది. నెమలిని పట్టుకోవాలని కాదు కదా.. చూస్తున్నందుకు దానికి కొపం వచ్చేసింది. అమాంతం ఎగిరి తను చూస్తున్న ఆ ముద్దుగుమ్మ పై పొడిచింది. దీంతో అనుకోని ఆ సంఘటనతో ఆ బ్యూటీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో చెప్పలేదు కదూ. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ సరసన హిప్పీ సినిమాలో నటించిన దిగంగన సూర్యవంశి.. ఈమెపై నెమలి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హీరోయిన్ దిగంగన సూర్యవంశి.. ఒక అందమైన నెమలి దగ్గరకు వెళ్లింది. దానిని చూస్తూ అక్కడే నిల్చోని నవ్వుతూ.. దానికి మరింత దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. మెల్లిగా నడుస్తున్న నెమలి ఒక్కసారిగా ఆమె పైకి ఎగిరి పొడిచింది. దీంతో దిగంగన గట్టిగా అరుస్తూ.. చేతులతో నెమలిని తోసేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ దిగంగన సూర్యవంశి.. బాలీవుడ్‌లో పలు సీరియళ్లలో నటించిన దిగంగన..‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్‌-9లోకి వెళ్లింది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’సినిమాలో నటించింది. ప్రస్తుతం గోపిచంద్‌ హీరోగా నటిస్తున్న సీటీమార్‌ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.

వీడియో..

Also Read: షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Krithi Shetty: ఉప్పెనలా ముంచే అందం ఆమెది.. కవ్వించే కొంటె చూపు కుర్రది… కృతిశెట్టి