NTR 30: ఫ్యాన్స్ బీ రెడీ.. ఆ సినిమాపై బిగ్ అనౌన్స్‏మెంట్ ఇవ్వనున్న మేకర్స్.. ఆ స్టార్ హీరోల చిత్రాలపై స్పష్టత..

Jr. NTR New movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్‎లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్.. మాటల మాంత్రికుడు

NTR 30: ఫ్యాన్స్ బీ రెడీ.. ఆ సినిమాపై బిగ్ అనౌన్స్‏మెంట్ ఇవ్వనున్న మేకర్స్.. ఆ స్టార్ హీరోల చిత్రాలపై స్పష్టత..
Ntr Trivikram
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 12, 2021 | 5:09 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్‎లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఉగాది తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని.. ఎన్టీఆర్ కంటే ముందు త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేయబోతున్నాడని.. అటు ఎన్టీఆర్ కూడా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. బుచ్చిబాబు, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‏లో రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ తర్వాతి చిత్రం పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. వీరిధ్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారెజ్ సూపర్ హిట్‏గా నిలిచింది. చాలా కాలం తర్వాత వీరి కాంబో రిపీట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నా.. కొరటాల శివ.. అల్లు అర్జున్ సినిమా సంగతి ఏం జరిగింది ? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 12న ఈ ప్రశ్నలకు ఓ స్పష్టమైన ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా.. అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా విషయాలపై ఇవాళ ఓ కచ్చితమైన అనౌన్స్‏మెంట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండగా.. వీరిద్దరికి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామా ఓలివియా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.

Also Read: మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే