‘దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’.. ఆకట్టుకుంటున్న ‘మేజర్’ టీజర్..

Major Movie Teaser: టాలీవుడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్న తెలిసిందే. ముంబైలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో

'దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని'.. ఆకట్టుకుంటున్న 'మేజర్' టీజర్..
Shesh


Major Movie Teaser: టాలీవుడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్న తెలిసిందే. ముంబైలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో అడవి శేష్ మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో నటిస్తున్నాడు.  తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
ముంబైలో జరిగిన బాంబు దాడిలో తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథాంశంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ విషయానికొస్తే సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఇమిడిపోయాడనే చెప్పాలి.  ‘‘మన బోర్డర్‌లో ఆర్మీ ఎలా ఫైట్‌ చేయాలి? ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా గెలవాలి? అని అందరూ ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’’ అంటూ శేష్‌  చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. హిందీ సల్మాన్, మలయాళం లో పృథ్విరాజ్  విడుదల చేశారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akshay Kumar Covid: కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ హీరో… ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటోన్న ఆయన సతీమణి..

రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..