AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వకీల్ సాబ్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు..? ‘ఐకాన్’ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు..

Vakeel Saab Director Venu Sriram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా సంచలన విజయాన్ని సొంతంచేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది.

వకీల్ సాబ్  డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు..?  'ఐకాన్' కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు..
Bunny
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2021 | 5:14 PM

Share

Vakeel Saab Director Venu Sriram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా సంచలన విజయాన్ని సొంతంచేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. వకీల్ సాబ్ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి శ్రీరామ్ కు వరుస అవకాశాలు క్యూ కడతాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకంటే ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను కన్ఫామ్ చేసాడు వేణు శ్రీరామ్. ఈ మూవీకి ఐకాన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను కూడా పెట్టేసాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ఈ మధ్య వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. వకీల్ సాబ్ సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత వేణు శ్రీరామ్ పూర్తిగా ఆ సినిమా పనిలో పడ్డాడు. అటు బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.  ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ కోసం స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో ఐకాన్ సినిమా అటకెక్కేసిందని టాక్ నడుస్తుంది.  తాజాగా ఈ సినిమా పై మరో వార్త వినిపిస్తుంది. పుష్ప సినిమా అనుకోని కారణాలవల్ల ఆలస్యం అవుతుందట. దాంతో ఆ తర్వాత  కొరటాల తో అనుకున్న సినిమా కూడా కాస్త వెనకకు వెళ్లనుందట. అయితే  కొరటాల మెగాస్టార్ ఆచార్యను పూర్తి చేసి ఎన్టీఆర్ తో సినిమా చేసే యోచనలో ఉన్నాడట. దాంతో పుష్ప సినిమా తర్వాత వచ్చిన గ్యాప్ లో ఐకాన్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట బన్నీ. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘దేశాన్ని ప్రేమించటం అందరి పని. వాళ్లని కాపాడటం సోల్జర్‌ పని’.. ఆకట్టుకుంటున్న ‘మేజర్’ టీజర్..

Akshay Kumar Covid: కరోనా నుంచి కోలుకున్న స్టార్‌ హీరో… ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అంటోన్న ఆయన సతీమణి..

రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్